వాలీబాల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ సంచలనం

వాలీబాల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ సంచలనం

హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌‌‌‌లో ఇండియా మెన్స్‌‌‌‌ వాలీబాల్‌‌‌‌ టీమ్‌‌‌‌ సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసింది. బుధవారం జరిగిన పూల్‌‌‌‌–సి మ్యాచ్‌‌‌‌లో ఇండియా 3–2 తేడాతో  గత ఎడిషన్‌‌‌‌ సిల్వర్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌ సౌత్‌‌‌‌ కొరియాను ఓడించి సంచలనం సృష్టించింది. ఐదు సెట్ల పాటు థ్రిల్లింగ్‌‌‌‌గా సాగిన పోరులో  అమిత్‌‌‌‌ గులియా, అశ్వల్‌‌‌‌ రాయ్‌‌‌‌ కీలక పాయింట్లతో టీమ్‌‌‌‌ను గెలిపించారు. 

మంగళవారం తొలి పోరులో 3–0తో కంబోడియాను ఓడించిన ఇండియా ఐదు పాయింట్లతో పూల్‌‌‌‌–సిలో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ సాధించి నాకౌట్‌‌‌‌ రౌండ్‌‌‌‌కు చేరుకుంది. తదుపరి రౌండ్‌‌‌‌లో ఇండియా.. చైనీస్‌‌‌‌ తైపీ లేదా మంగోలియాతో తలపడనుంది. ఆసియా గేమ్స్‌‌‌‌లో ఇండియా వాలీబాల్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఇప్పటిదాకా ఒకే ఒక్క  మెడల్ నెగ్గింది. 1986లో బ్రాంజ్‌‌‌‌ సాధించింది. గత  ఎడిషన్‌‌‌‌లో 12వ స్థానంతో సరిపెట్టింది. 

మరోవైపు రోయింగ్‌‌‌‌లో ఇండియా మెన్స్‌‌‌‌ ఫోర్‌‌‌‌ కాక్స్‌‌‌‌లెస్‌‌‌‌ టీమ్‌‌‌‌ నేరుగా ఫైనల్‌‌‌‌కు క్వాలిఫై అయింది. జవీందర్‌‌‌‌ సింగ్‌‌‌‌, భీన్‌‌‌‌ సింగ్, పునీత్‌‌‌‌ కుమార్‌‌‌‌, ఆశీష్‌‌‌‌తో కూడిన జట్టు హీట్స్‌‌‌‌లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ సాధించింది. విమెన్స్‌‌‌‌ కాక్స్‌‌‌‌లెస్‌‌‌‌, మెన్స్‌‌‌‌ కాక్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎయిట్స్‌‌‌‌ టీమ్ కూడా ఫైనల్‌‌‌‌ రేసుకు క్వాలిఫై అయ్యాయి.