ఆస్ట్రేలియాతో ఇండియా థర్డ్‌‌‌‌ టీ20.. తిలక్‌‌‌‌‌‌కు ఆఖరి చాన్స్‌‌‌‌

ఆస్ట్రేలియాతో ఇండియా థర్డ్‌‌‌‌ టీ20.. తిలక్‌‌‌‌‌‌కు ఆఖరి చాన్స్‌‌‌‌

గువాహటి: ఆస్ట్రేలియాపై వరుసగా తొలి రెండు టీ20ల్లో గెలిచి జోరుమీదున్న యంగ్‌‌‌‌ టీమిండియా మూడో మ్యాచ్‌‌‌‌కు రెడీ అయ్యింది. మంగళవారం బర్సాపర స్టేడియంలో కంగారూలతో జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ నెగ్గి ఇక్కడే సిరీస్‌‌‌‌ను సొంతం చేసుకోవాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. దీని కోసం మరోసారి తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో తెలుగు బ్యాటర్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మకు ఈ మ్యాచ్‌‌‌‌ ఆఖరి అవకాశంగా మారింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌‌‌‌కు వస్తున్న అతను గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో కేవలం12 బాల్స్‌‌‌‌ ఎదుర్కొని 19 రన్స్‌‌‌‌ చేశాడు. రింకూ సింగ్‌‌‌‌ ఫినిషర్‌‌‌‌ పాత్రను సమర్థంగా పోషిస్తుండటంతో తిలక్‌‌‌‌కు పెద్దగా ఆడే చాన్స్‌‌‌‌ రావడం లేదు. 

దీనికి తోడు చివరి రెండు టీ20లకు శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ టీమ్‌‌‌‌లోకి వస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి ప్లేస్‌‌‌‌ ఇవ్వాలంటే తిలక్‌‌‌‌ తప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ మ్యాచ్‌‌‌‌లో భారీ స్కోరు చేయాలని తెలుగు బ్యాటర్‌‌‌‌ ఆశిస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో తిలక్‌‌‌‌ను ప్రమోట్‌‌‌‌ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. మరి కెప్టెన్‌‌‌‌గా సూర్య కుమార్‌‌‌‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో యశస్వి, రుతురాజ్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ హాఫ్‌‌‌‌ సెంచరీలతో సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్నారు. 

బౌలింగ్‌‌‌‌లోనూ ఇండియాకు ఎదురులేదు. పిచ్‌‌‌‌ పరిస్థితిని బట్టి పేసర్లు, స్పిన్నర్లు తమ ప్రభావం చూపిస్తుండటం బాగా కలిసొస్తున్నది. పేసర్‌‌‌‌ ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, స్పిన్నర్‌‌‌‌ రవి బిష్ణోయ్‌‌‌‌ను ఎదుర్కొవడంలో కంగారూలు తడబడుతున్నారు. ఈ మ్యాచ్‌‌‌‌లోనూ ఇదే కంటిన్యూ అవుతుందని భావిస్తున్నారు. అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, ముకేశ్‌‌‌‌ కూడా సత్తా చాటితే సిరీస్‌‌‌‌ గెలవడం అసాధ్యం కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌‌‌‌కు వర్షం ముప్పు లేకపోయినా మంచు ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కాబట్టి ముందుగా బ్యాటింగ్‌‌‌‌ చేస్తే భారీ టార్గెట్‌‌‌‌ను నిర్దేశించాలి.

గెలిచి.. నిలవాలి 

మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌‌‌‌ కోసం కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. సీన్‌‌‌‌ అబాట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో బెరెన్‌‌‌‌డార్ఫ్‌‌‌‌ తుది జట్టులోకి రావొచ్చు. బ్యాటింగ్‌‌‌‌లో స్మిత్‌‌‌‌, షార్ట్‌‌‌‌ శుభారంభం ఇవ్వాల్సి ఉంది. ఈ ఇద్దరూ ఫెయిలవుతుండటంతో మిడిలార్డర్‌‌‌‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంటున్నది. భారీ హిట్టర్లు ఇంగ్లిస్‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ రాణించలేకపోవడం కూడా ఆసీస్‌‌‌‌కు ప్రతికూలంగా మారింది. టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ భారీ షాట్లు ఆడుతున్నా వికెట్‌‌‌‌ను కాపాడుకోలేకపోతున్నాడు. వేడ్‌‌‌‌ చివర్లో మంచి ఇన్నింగ్స్‌‌‌‌ ఆడుతున్నా లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ నుంచి సహకారం అందడం లేదు. ఓవరాల్‌‌‌‌గా బ్యాటర్లు గాడిలో పడితేనే ఈ మ్యాచ్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ విజయాన్ని అంచనా వేయొచ్చు. బౌలింగ్‌‌‌‌లో నేథన్‌‌‌‌ ఎలిస్‌‌‌‌ మినహా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇండియన్‌‌‌‌ టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ను కట్టడి చేయడంలో పేసర్లు విఫలమవుతున్నారు. స్పిన్నర్లు జంపా, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, సంగా కూడా మిడిల్‌‌‌‌ ఓవర్స్‌‌‌‌లో రన్స్‌‌‌‌ను ఆపలేకపోతున్నారు. మొత్తానికి ఈ సిరీస్‌‌‌‌ కాపాడుకోవాలంటే బ్యాటర్లు, బౌలర్లు శక్తికి మించి శ్రమించాల్సిందే.  
 

జట్లు (అంచనా)
ఇండియా
: సూర్య కుమార్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), యశస్వి జైస్వాల్‌‌‌‌, రుతురాజ్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, తిలక్‌‌‌‌ వర్మ, రింకూ సింగ్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, రవి బిష్ణోయ్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌. 
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), స్మిత్‌‌‌‌, షార్ట్‌‌‌‌, ఇంగ్లిస్‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌, టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌, ఆడమ్ జంపా, నేథన్‌‌‌‌ ఎలిస్‌‌‌‌, బెరెన్‌‌‌‌డార్ఫ్‌‌‌‌ / సీన్‌‌‌‌ అబాట్‌‌‌‌, తన్వీర్‌‌‌‌ సంగా. 

మరో 60 రన్స్‌‌‌‌ చేస్తే సూర్య కుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌.. ఇండియా తరఫున 2 వేల రన్స్‌‌‌‌ పూర్తి చేసిన నాలుగో బ్యాటర్‌‌‌‌గా రికార్డులకెక్కుతాడు.