వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెగా ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీ

 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెగా ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీ

ఒక్క రోజు చాలు..  చరిత్ర సృష్టించడానికి..! ఒక్క మ్యాచ్ చాలు..   అనామకులు హీరోలుగా మారడానికి! ఒక్క విజయం చాలు..  క్రికెట్ ప్రపంచాన్ని గెలవడానికి..  వరల్డ్ చాంపియన్లుగా చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకోవడానికి..! టీమిండియా కోసం ఆ రోజు రానే వచ్చింది..!  నేడే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్. 

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రపంచంలోనే అతి పెద్ద  క్రికెట్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అతి పెద్ద సమరం జరగనుంది.!
సొంతగడ్డపై  టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఇండియా మరొక్క మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదరగొడితే మూడోసారి జగజ్జేత కానుంది..!


ఇంకొక్క విజయం సాధిస్తే 12 ఏండ్ల తర్వాత వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గి యావత్ దేశాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తనుంది..!కానీ, ఎదురుగా ఉన్న ప్రత్యర్థి మామూలు జట్టు కాదు. ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఆరో కప్పుపై గురి పెట్టింది..!ఆ జట్టుతో విజయమో వీర స్వర్గమో తేల్చుకునేందుకు మన సైన్యం సిద్ధమైంది..!  కంగారూలతో 22 గజాల పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కొట్లాడే 11 మందికి స్టేడియంలో లక్ష పైచిలుకు ప్రేక్షకులు.. బయట  కోట్లాది మంది అభిమానులు అండగా ఉన్నారు..!  వారి విజయాన్ని ఆశిస్తూ, శ్వాసిస్తూ విజయీభవ అని దీవిస్తున్నారు. మరి, 2003 వరల్డ్ కప్​ ఫైనల్, గతేడాది వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఫైనల్ ఓటమికి ఆస్ట్రేలియాపై టీమిండియా రివెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీర్చుకుంటుందా? 1983లో లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కపిల్ డెవిల్స్, 2011లో వాంఖడేలో  ధోనీసేన చేసిన మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోహిత్​సేన రిపీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుందా?  మూడో కప్పు తెచ్చి తీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొడుతుందా?

అహ్మదాబాద్:   ‘మిషన్​ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2023’ని సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ముగించేందుకు టీమిండియా సిద్ధమైంది. సొంతగడ్డపై మెగా టోర్నీలో అసాధారణంగా ఆడుతూ..  అజేయంగా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన ఆదివారం ఇక్కడి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఆఖరాటలో ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. స్టేడియంలో లక్ష మంది, బయట కోట్లాది మంది అభిమానుల మద్దతు నడుమ మూడోసారి కప్పు నెగ్గి చరిత్రలో నిలవాలని, అందుకోసం ప్రాణం పెట్టి ఆడాలని  కెప్టెన్ రోహిత్, మరో పది మంది ఆటగాళ్లంతా రెడీ అయ్యారు.  2011లో కప్పు నెగ్గిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగమైన విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విన్నింగ్ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు. కెప్టెన్ రోహిత్ శర్మ 2007లో ఆటగాడిగా టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముద్దాడాడు. వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిస్తే వచ్చే కిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు. ఈ ముగ్గురితో పాటు మిగతా వాళ్లూ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విన్నింగ్ ఫీలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆస్వాదించే అవకాశం, సమయం వచ్చాయి. ఇక, కొన్నేండ్లుగా టీ20ల జోరుతో వన్డే ఫార్మాట్ కొట్టుమిట్టాడుతోంది. ఇండియా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గితే ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త ఊపిరి లభించనుంది.

దుర్బేధ్యంగా ఇండియా 

మెగా టోర్నీలో టీమిండియా ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అదే జోరు ఫైనల్లోనూ చూపించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. నిర్భయంగా, దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ (124 స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 550 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) జట్టు విజయాలకు పునాది వేస్తున్నాడు. తను ఇచ్చే మెరుపు ఆరంభాలను సద్వినియోగం చేసుకుంటూ రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెషిన్ విరాట్ కోహ్లీ (90 స్ట్రయిక్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 711) జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆరంభంలో డెంగీతో ఇబ్బంది పడ్డ మరో ఓపెనర్ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోలుకొని వచ్చి తన క్లాస్ చూపెడుతున్నాడు. షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ బలహీనతను అధిగమించిన శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండు సెంచరీలతో జోరు మీదున్నాడు. 

ఇండియాను శత్రు దుర్బేధ్యంగా మార్చిన వ్యక్తి కచ్చితంగా మహ్మద్ షమీనే. తుది జట్టులోకి ఆలస్యంగా వచ్చినా తన స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నాడు.  బ్యాటర్లు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను గెలిపిస్తారు కానీ  బౌలర్లు  కూడా టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించగలరనే పాత సామెత నిజం అని మరోసారి నిరూపించాడు. కేఎల్ రాహుల్ సూపర్ కీపింగ్, బ్యాటింగ్, జడేజా ఆల్ రౌండ్  షో  చూపెడుతున్నారు. తన స్పిన్ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్న కుల్దీప్ యాదవ్, యార్కర్ల కింగ్ బుమ్రా సైతం ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.  దాంతో  విన్నింగ్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చాల్సిన అవసరం కనిపించడం లేదు. ఇండియా ఇదే జోరును కొనసాగిస్తూ, ఆటగాళ్లంతా సమష్టిగా రాణిస్తే కప్పు నెగ్గడం కష్టం కాబోదు.

ఆసీస్ అంతే బలంగా

ఐదుసార్లు వరల్డ్ కప్ విన్నర్ అయిన ఆస్ట్రేలియా ఒకప్పటిలా దుర్బేధ్యంగా లేకపోయినా అన్ని విభాగాల్లో బలంగానే ఉంది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆటుపోట్లకు గురైనప్పటికీ మెగా ఈవెంట్లలో ఎలా గెలవాలో  ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బాగా తెలుసు. ఇండియాను ఒత్తిడిలో  పడేసే ఏకైక జట్టు అదే. టోర్నీలో తొలుత వరుసగా రెండు ఓటములు ఎదురైన తర్వాత కంగారూ టీమ్ గొప్పగా పుంజుకుంది. వరుసగా ఎనిమిది విజయాలతో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చింది. పైగా, టీమిండియా అనగానే రెచ్చిపోయే వార్నర్, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జంపా వంటి స్టార్లకు తోడు ట్రావిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్, మిచెల్ మార్ష్​, లబుషేన్, ఇంగ్లిస్ వంటి టాలెంటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లతో కంగారూ టీమ్ బలంగా ఉంది. కాబట్టి ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. 2003, 2007లో ఆస్ట్రేలియా వరుసగా 11 విక్టరీలతో వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సొంతం చేసుకుంది. ఆ ఘనతను మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఇండియా మూడోసారి విశ్వవిజేతగా నిలుస్తుందేమో చూడాలి.

ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరారిలా..

లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో ఆడిన 9 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో నెగ్గిన ఇండియా.. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధిం చింది. ఇక తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఇండి యా, సౌతాఫ్రికా చేతిలో ఓడిన ఆస్ట్రేలియా ఆఖరి 8 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో వరుసగా గెలిచింది. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాను మరోసారి ఓడించి ఫైనల్లోకి దూసుకొచ్చింది. 

పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/వాతావరణం

లీగ్ దశలో ఇండియా-పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాడిన పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫైనల్ జరగనుంది. నల్లమట్టితో తయారు చేసిన వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రెండ్రోజులుగా నీళ్లు చల్లుతూ బాగా రోలింగ్ చేస్తున్నారు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్లోగా మారొచ్చు. రాత్రి పూట  మంచు ప్రభావం చూపనుంది.  ఇక్కడ గత ఐదు మ్యాచ్‌‌ల్లో నాలుగుసార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. టాస్‌‌ నెగ్గిన జట్టు ఫస్ట్ బ్యాటింగ్‌‌కు మొగ్గు చూపొచ్చు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాన ముప్పు లేదు. ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిజర్వ్ డే (సోమవారం) ఉంది.