ఇంకో 6 వికెట్లే..  బౌలర్లపైనే భారం

ఇంకో 6 వికెట్లే..  బౌలర్లపైనే భారం

సెంచూరియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  సౌతాఫ్రికాతో ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టులో విక్టరీకి టీమిండియా ఇంకో 6 వికెట్ల దూరంలో నిలిచింది. వరుసగా రెండో రోజూ బ్యాటర్లు ఫెయిలైనప్పటికీ.. బౌలర్లు మరోసారి తమ స్టామినా చూపెట్టారు. దాంతో, 305  టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగో రోజు, బుధ వారం ఆట చివరకు  సౌతాఫ్రికా సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  94/4 స్కోరుతో కష్టాల్లో పడ్డది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్గర్ (52 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫిఫ్టీతో నిలబడ్డా.. జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా (2/22), షమీ (1/29), సిరాజ్ (1/25) దెబ్బకు టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తడబడ్డది. చేతిలో ఇంకో ఆరు వికెట్లుండగా.. సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంకా 211 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరం. కానీ, పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టంగా మారింది. పైగా,  ఈ స్టేడియంలో హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజ్ 251 మాత్రమే.  కాబట్టి హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొప్పగా పోరాడితే తప్ప ఓటమి తప్పించుకోలేదు.అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు 16/1తో ఆట కొనసాగించిన ఇండియా సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50.3 ఓవర్లలో 174 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (34) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  సఫారీ బౌలర్లలో రబాడ (4/42), జాన్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4/55), ఎంగిడి (2/31) ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టారు. అయినా ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలుపుకొని హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కోహ్లీసేన పెద్దటార్గెటే ఇచ్చింది. దానికి తోడు పేసర్లు సత్తా చాటి విజయానికి పునాది వేశారు. లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే, గురువారం ఫస్ట్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆట కీలకం కానుంది.  

ఇండియా ఢమాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
ఫస్ట్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్క ఇండియా మరోసారి మంచి స్కోరు చేయలేకపోయింది. అనూహ్యంగా  బౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అవుతున్న బాల్స్​ను  ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంలో ఇబ్బంది పడి పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టారు. ముందుగా రబాడ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10) సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ హీరో కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (23) గంట సేపటి వరకూ చాలా ఓపిగ్గా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. కానీ, ఎంగిడి ఓ షార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నకుల్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెనక్కుపంపాడు.  పుజారా (16), కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (18) మళ్లీ ఫెయిలయ్యారు. నాలుగు ఫోర్లు కొట్టిన కోహ్లీ టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చినట్టే కనిపించాడు. కానీ, 79/3తో లంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన వెంటనే  యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాన్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రహానె (20).. జాన్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్లో వరుసగా 4,6,4తో దూకుడు చూపెట్టాడు. కానీ, తన తర్వాతి ఓవర్లోనే రహానెను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన జాన్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీర్చుకోగా.. అంతకుముందు ఓవర్లోనే ఎంగిడి బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుజారా పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరాడు. 111/6 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (14) బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీస్తూ  ఇండియా టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 300 మార్కు వరకు తీసుకెళ్లారు. అయితే, రబాడ తన వరుస ఓవర్లో ఈ ఇద్దరితో పాటు షమీ (3)ని ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా.. జాన్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0) బౌల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవడంతో  సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసింది. 

పేసర్ల జోరు.. ఎల్గర్‌‌‌‌‌‌‌‌‌‌ పోరాటం..
టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ డీన్‌‌‌‌‌‌‌‌ ఎల్గర్‌‌‌‌‌‌‌‌ బాగానే పోరాడుతున్నా.. తక్కువ స్కోర్లకే మూడు టాపార్డర్‌‌‌‌‌‌‌‌ సహా 4 వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఇండియాను రేసులో నిలబెట్టారు. షమీ తన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్లోనే సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టాడు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఐదు వికెట్లు పడగొట్టి మస్తు జోష్‌‌‌‌‌‌‌‌లో ఉన్న షమీ..  తన మూడో బాల్‌‌‌‌‌‌‌‌కే ఓపెనర్‌‌‌‌‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (1)ను బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్టంప్‌‌‌‌‌‌‌‌కు దూరంగా వెళ్తున్న బాల్‌‌‌‌‌‌‌‌ను మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ లేట్‌‌‌‌‌‌‌‌గా వదిలేయాలని చూడగా.. అది బ్యాట్‌‌‌‌‌‌‌‌కు తగిలి వికెట్లను పడగొట్టింది. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన కీగన్‌‌‌‌‌‌‌‌ పీటర్సన్‌‌‌‌‌‌‌‌ (17)తో కలిసి  కెప్టెన్‌‌‌‌‌‌‌‌ డీన్‌‌‌‌‌‌‌‌ ఎల్గర్ టీమ్‌‌‌‌‌‌‌‌ను 22/1తో టీకి తీసుకెళ్లాడు. కానీ, బ్రేక్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన వెంటనే ఓ ఫుల్ డెలివరీతో కీగన్‌‌‌‌‌‌‌‌ను సిరాజ్‌‌‌‌‌‌‌‌ కాట్‌‌‌‌‌‌‌‌ బిహైండ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. అయినా.. ఎల్గర్‌‌‌‌‌‌‌‌ వెనక్కుతగ్గలేదు. డుసెన్‌‌‌‌‌‌‌‌ (11)తో కలిసి డెడ్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ చూపెట్టాడు. ఈ ఇద్దరూ 22 ఓవర్ల పాటు వికెట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. అయితే, మళ్లీ బాల్‌‌‌‌‌‌‌‌ అందుకున్న బుమ్రా చివర్లో మ్యాజిక్​ చేశాడు. ఓ క్లాసిక్‌‌‌‌‌‌‌‌ డెలివరీతో డుసెన్‌‌‌‌‌‌‌‌ను క్లీన్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దాంతో థర్డ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌కు 40 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అయింది. ఇక, డే చివరి ఓవర్లో  నైట్​ వాచ్​మయన్​ కేశవ్‌‌‌‌‌‌‌‌ (8)ను కూడా సూపర్బ్‌‌‌‌‌‌‌‌ యార్కర్‌‌‌‌‌‌‌‌తో బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేసి నాలుగో రోజుకు ఫినిషింగ్‌‌‌‌‌‌‌‌ టచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 

స్కోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
ఇండియా ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  327 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌;
సౌతాఫ్రికా ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 197 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌; 
ఇండియా సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 50.3  ఓవర్లలో 174 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 34, రబాడ 4/42, జాన్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4/55); 
సౌతాఫ్రికా సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 305): 40.5 ఓవర్లలో 94/4 (ఎల్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 54 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,
 బుమ్రా 2/22).