Asia Cup 2023 Final: వరుణుడు వచ్చేశాడు.. మ్యాచ్ ఆలస్యం

Asia Cup 2023 Final: వరుణుడు వచ్చేశాడు.. మ్యాచ్ ఆలస్యం

గత మ్యాచ్‌ల వలే ఫైనల్‌ పోరుకు ముఖ్య అతిథి హాజరయ్యాడు. ఆ ముఖ్య అతిథి మరేవరో కాదండోయ్.. వర్షం. టాస్‌ వేసి మ్యాచ్‌ ప్రారంభానికి సిద్ధమవుతున్న క్రమంలో వర్షం మొదలైంది. దీంతో హుటాహుటీన సిబ్బంది పిచ్‌తో పాటు మైదానాన్ని కవర్లతో కప్పేశారు. ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది.

బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో గాయపడిన తీక్షణ బదులు స్పిన్నర్ హేమంత్ జట్టులోకి రాగా.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న భారత్ కీలక ప్లేయర్లు తిరిగి జట్టులో చేరారు. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్ టన్ సుందర్ కి అవకాశం దక్కింది. 

భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్ టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.

శ్రీలంక తుది జట్టు: పతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్) , సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మధుశన్, మతీషా పతిరణ.