క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌పై దృష్టి

 క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌పై దృష్టి
  • నేడు జింబాబ్వేతో ఇండియా థర్డ్‌‌‌‌‌‌‌‌ వన్డే
  • మ. 12.45 నుంచి సోనీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లో

హరారే: గత రెండు వన్డేల్లో ఏకపక్ష విజయాలు సాధించిన టీమిండియా.. ఇప్పుడు క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌పై దృష్టిపెట్టింది. సోమవారం జింబాబ్వేతో జరిగే ఆఖరిదైన మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌ను 3–0తో ముగించాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌కు వారం రోజులే టైమ్‌‌‌‌‌‌‌‌ ఉండటంతో ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రావడానికి కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌కు ఇదే లాస్ట్ చాన్స్‌‌‌‌‌‌‌‌. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అతను ఒక్క రన్‌‌‌‌‌‌‌‌కే ఔట్‌‌‌‌‌‌‌‌కావడంతో ఆందోళన మొదలైంది. దీంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కేఎల్ భావిస్తున్నాడు. ఇక ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా గిల్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాడు.

కాబట్టి అతన్ని కొనసాగించి ధవన్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో రుతురాజ్‌‌‌‌‌‌‌‌ను పంపే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌పై ఆశలు పెట్టుకున్న కుర్రాళ్లు కూడా మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌, సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌ హుడా తమ సత్తా ఏంటో చూపెందుకు రెడీ అవుతున్నారు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు ఇబ్బందుల్లేవు. మరోవైపు జింబాబ్వే ఈ మ్యాచ్​లోనైనా గెలిచి పరువైనా దక్కించుకోవాలని చూస్తోంది.