టీమిండియా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ షురూ

టీమిండియా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ షురూ
  • వన్డే టీమ్​లోకి ఇషాన్​ కిషన్

అహ్మదాబాద్: వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం టీమిండియా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ షురూ చేసింది. నలుగురు ప్లేయర్లు సహా టీమ్‌‌‌‌‌‌‌‌లో ఏడుగురు కరోనా పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా తేలడంతో ఫస్ట్ వన్డే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటూ పుకార్లు వచ్చినప్పటికీ.. గురువారం అహ్మదాబాద్ స్టేడియంలో ఇండియా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్ సెషన్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంది. శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్, సైనీ మినహా మిగతా ప్లేయర్లకు తాజా టెస్టుల్లో నెగెటివ్‌‌‌‌‌‌‌‌ రిపోర్టు రావడంతో రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ కెప్టెన్సీలోని టీమ్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది. ప్లేయర్లతో పాటు కరోనా పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా తేలిన ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్, సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ బి.లోకేశ్, మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్ మాత్రం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా, వన్డే టీమ్ లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ మూడు రోజుల క్వారంటైన్ తర్వాత టీమ్ తో కలుస్తాడు. అలాగే స్పెషలిస్ట్ ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా కీపర్‌‌‌‌‌‌‌‌ ఇషాన్ కిషన్ ను కూడా టీమ్ లోకి తీసుకున్నారు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వన్డే ఆదివారం జరగనుంది. వారం రోజులు క్వారంటైన్‌‌‌‌‌‌‌‌లో ఉండాల్సిన నేపథ్యంలో ధవన్‌‌‌‌‌‌‌‌, రుతురాజ్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు దూరం కానున్నారు. 

నేను మంచిగనే ఉన్న: ధవన్

కరోనా పాజిటివ్ గా తేలిన శిఖర్ ధవన్ తాను బాగానే ఉన్నట్లు తెలిపాడు. ఐసోలేషన్ లో ఉన్న ధవన్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు.