కోహ్లీ లేకున్నా భారత్ గెలుస్తుంది

కోహ్లీ లేకున్నా భారత్ గెలుస్తుంది

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. కోహ్లీ లేకపోతే భారత్ కు మంచిదేనని అన్నాడు. ఆస్ట్రేలియాతో డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మొదటి మ్యాచ్‌ మాత్రమే ఆడనున్నాడు. ఆ తర్వాత  పెటర్నిటీ లీవ్స్ పై  భారత్‌కు తిరిగి వచ్చేస్తాడు. అయితే… కోహ్లీ లేకపోవడం టీమిండియాకు  పెద్ద లోటే అయినా అందులో ఓ మంచి విషయం కూడా ఉందంటున్నాడు గవాస్కర్.

విరాట్‌ కోహ్లీ ఆడని ప్రతీ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించిందని… ధర్మశాలలో ఆస్ట్రేలియాపై, అఫ్గానిస్థాన్‌ తో ఒక టెస్టు. నిదహాస్‌ ట్రోఫీ, 2018 ఆసియా కప్‌ ను …కోహ్లీ లేని మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచిందన్నారు. అతడు లేనప్పుడు ఇతర ఆటగాళ్లు బాగా ఆడడానికి ప్రయత్నిస్తారన్నాడు. అతడు లేని లోటును భర్తీ చేయాలని అర్థం చేసుకుంటారన్నాడు గవాస్కర్. అలాగే కెప్టెన్‌ గైర్హాజరీతో అజింక్య రహానె, ఛటేశ్వర్  పుజారాకు కష్టమవుతుందని అన్నాడు. వాళ్లిద్దరూ బ్యాట్‌తో రాణించాల్సి ఉంటుందని తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యత రహానెకు ఉపయోగ పడుతుందని కూడా చెప్పాడు. కోహ్లీ లేనప్పుడు జట్టును ఎవరు నడిపించాలనే విషయంపై సెలెక్షన్‌ కమిటీ స్పష్టతతో ఉందన్నాడు సన్నీ.