అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత భారత్

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత భారత్

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ అవతరించింది. సౌతాఫ్రికాలో జరుగుతున్న తొలి మహిళల ప్రపంచ కప్ ను టీమిండియా  కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.  

తొలుత భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ కేవలం 68 పరుగులకే ఆలౌట్ కాగా..ఆ తర్వాత 69 పరుగుల టార్గెట్ ను భారత్ కేవలం 14 ఓవర్లలోనే చేధించింది. 

https://twitter.com/BCCIWomen/status/1619701200169086976

అందకుముందు ఐసీసీ అండర్ 19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది.  టాస్ గెలిచి  ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బంతులు వేసి ఇంగ్లండ్  బ్యాట్స్ మెన్స్ ను బెంబేలేత్తించింది. నియామ్ ఫియోనా హాలండ్ (10), ర్యానా మక్డోనాల్డ్ (19), సోఫియా స్మేల్ (10), అలెక్సా స్టోన్‌హౌస్(11) మినహా మిగితా బ్యాట్స్ మెన్స్ అంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో టిటాస్ సాధు, అర్చన దేవి, పార్షవి చోప్రా తలో రెండు వికెట్లు తీశారు.