తొలి రోజే పతక పంచ్.. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఇండియాకు నాలుగు మెడల్స్

తొలి రోజే పతక పంచ్.. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఇండియాకు నాలుగు మెడల్స్

గ్రేటర్ నోయిడా:  వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు నాలుగు మెడల్స్ ఖాయం అయ్యాయి. ఆదివారం (నవంబర్ 16) నేరుగా క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన వరల్డ్ చాంపియన్ మీనాక్షి (48 కేజీలు), ప్రీతి (54 కేజీలు), అంకుష్ ఫంగల్ (80 కేజీలు), నరేందర్ బెర్వాల్ (90+ కేజీలు) తమ బౌట్లలో ఘన విజయాలు సాధించి సెమీ-ఫైనల్లోకి ప్రవేశించారు. 

కజకిస్తాన్ బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోలట్ అక్బోటాపై మీనాక్షి, ఉజ్బెకిస్తాన్‌‌‌‌కు చెందిన  ఉక్తమోవాపై ప్రీతి ఈజీగా నెగ్గారు.  అంకుష్  తెలివైన కాంబినేషన్ ప్లేతో 5–0తో జపాన్ బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గో వకాయాను చిత్తు  చేయగా..  నరేందర్ 4–1తో  ఆండ్రీ ఖలేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీ (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై విజయం సాధించాడు.