V6 News

సౌతాఫ్రికాతో ఆఖరి టీ20లో చిత్తుగా ఓడిన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్

సౌతాఫ్రికాతో ఆఖరి టీ20లో చిత్తుగా ఓడిన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్

బెనోని (సౌతాఫ్రికా): రెండు నెలల్లో మొదలయ్యే టీ20 వరల్డ్ కప్‌‌‌‌ ముంగిట ఇండియా విమెన్స్ టీమ్ మరోసారి నిరాశపరిచింది. సౌతాఫ్రికాతో ఆఖరి టీ20లో చిత్తుగా ఓడి ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 1–4తో కోల్పోయింది.

కెప్టెన్ లారా వోల్‌‌‌‌వార్ట్  (56 బాల్స్‌‌‌‌లో11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 నాటౌట్) దంచికొట్టడంతో సోమవారం జరిగిన ఐదో టీ20లో సఫారీ టీమ్ 23  రన్స్‌‌‌‌ తేడాతో ఇండియాను ఓడించింది. వోల్‌‌‌‌వార్ట్‌‌‌‌ మెరుపులతో తొలుత సఫారీ టీమ్ 20 ఓవర్లలో 156/8 స్కోరు చేసింది.

ఇండియా బౌలర్లలో రేణుక సింగ్, శ్రీ చరణి, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో ఇండియా ఓవర్లన్నీ ఆడి 132/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. 

భారతీ ఫుల్మాలి (40) ఒంటరి పోరాటం చేసినా, సీనియర్ బ్యాటర్లు షెఫాలీ వర్మ (4), జెమీమా రోడ్రిగ్స్ (1), కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ (22) ఫెయిలవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఎంలాబా, డి క్లెర్క్ చెరో రెండు వికెట్లు తీశారు. వోల్‌‌‌‌వార్ట్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.