ఉమెన్స్ వరల్డ్ కప్‎లో‎ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ఉమెన్స్ వరల్డ్ కప్‎లో‎ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

న్యూజిలాండ్‏లోని బే ఓవల్ స్టేడియం వేదికగా ఇండియా, పాకిస్తాన్ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. నిలకడగా ఆడుతోంది. ఓపెనర్‎గా వచ్చిన స్మృతి మంధాన 75 బంతులు ఆడి 52 పరుగులు చేసి ఆనం అమిన్ బౌలింగ్ లో అవుటయింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మా డకౌట్ అయింది. దీప్తి శర్మ 40 పరుగులు చేసి నష్రా సందు బౌలింగ్ వెనుదిరిగింది. ప్రస్తుతం క్రీజ్ లో మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారు.

ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌.. మరోసారి వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ వేటకు రెడీ అయింది. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా.. ఇప్పటిదాకా తమకు అందని వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ను ఈసారి ఎలాగైనా సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రికార్డు స్థాయిలో కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఆరోసారి వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచిన లెజెండరీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మిథాలీ రాజ్‌‌‌‌‌‌‌‌ కప్పు నెగ్గి కల నెరవేర్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే  దాయాది జట్టు పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో అమీతుమీ తేల్చుకుంటోంది. ఏ టోర్నీలో అయినా పాక్‌‌‌‌‌‌‌‌ను ఓడిస్తే  ప్లేయర్లలో జోష్‌‌‌‌‌‌‌‌ పెరుగుతుంది. అది జరగాలంటే ఇండియా బౌలర్లు  రాణించాల్సి ఉంటుంది.  ఈ మెగా టోర్నీకి  ముందు న్యూజిలాండ్​తో సిరీస్​లో బ్యాటర్లు బాగానే ఆడినా బౌలర్లే టీమ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టారు. అయితే, చివరి వన్డేతో పాటు సౌతాఫ్రికా, వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో వామప్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లోనూ బౌలర్లు మంచి పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేయడం ఊరటనిచ్చే అంశం.  పేస్‌‌‌‌‌‌‌‌ను నడిపిస్తున్న సీనియర్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌ జులన్‌‌‌‌‌‌‌‌  నిలకడగా వికెట్లు పడగొడుతోంది. అయితే, మేఘనా సింగ్‌‌‌‌‌‌‌‌, పూజా వస్త్రాకర్‌‌‌‌‌‌‌‌, రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆమెకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ అవసరం. స్పిన్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మ అద్భుతంగా ఆడుతోంది. కివీస్‌‌‌‌‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో అందరికంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో  రాజేశ్వరీ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ బాగానే ఆడినప్పటికీ ఆమె మరింత నిలకడ చూపాలి. హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ కివీస్‌‌‌‌‌‌‌‌తో ఐదో వన్డేలో ఫిఫ్టీ, వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సెంచరీ కొట్టి ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రావడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మిథాలీ, ఓపెనర్ స్మృతి మంధాన, రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌,  దీప్తి శర్మ మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. దాంతో, మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మపైనే ఇప్పుడు ఒత్తిడి ఉంది. అంతగా టచ్‌‌‌‌‌‌‌‌లో లేని  షెఫాలీ... మంధానతో కలిసి టీమ్‌‌‌‌‌‌‌‌కు మంచి ఆరంభం అందించాల్సిన అవసరం ఉంది.  మరోవైపు  ఈ టోర్నీలో తక్కువ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ పాకిస్తానే. బిస్మా మరూఫ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీలో ఆ జట్టు వామప్‌‌‌‌‌‌‌‌లో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ గెలవడం విశేషం. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆతిథ్య కివీస్​ను కూడా ఓడించిన నేపథ్యంతో ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు.

మరిన్ని వార్తలు