కూలిన మిగ్ 21 విమానం.. ఓ పైలట్ మృతి

కూలిన మిగ్ 21 విమానం.. ఓ పైలట్ మృతి

మోగా: ఐఏఎఫ్ కుచెందిన ఓ యుధ్ధ విమానం కూలడంతో ఒక పైలట్ మృతి చెందిన ఘటన పంజాబ్ లో శుక్రవారం చోటు చేసుకుంది. పంజాబ్, మోగాలోని లంగియానా ఖుర్థ్ గ్రామంలో ఉదయం వేళల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్ 21 విమానం ప్రమాదవశాత్తూ నేలకూలింది. ఈ ఘటనలో విమానం నడుపుతున్న అభినవ్ చౌదరీ అనే పైలట్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఐఏఎఫ్ ధృవీకరంచింది. అభినవ్ మృతికి సంతాపం తెలిపిన ఎయిర్ ఫోర్స్.. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు స్పష్టం చేసింది. రోజువారీ శిక్షణలో భాగంగా ఈ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కూలిందని అధికారులు చెబుతున్నారు.