వాషింగ్టన్: వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి జరిగిన ఎ-లక్షన్‌లో డెమోక్రాట్ నాయకురాలు, భారత సంతతికి చెందిన గజాలా హష్మీ(54) విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ కన్జర్వేటివ్ రేడియో హోస్ట్ అయిన జాన్ రీడ్‌పై ఆమె 54.2% ఓటు షేర్‌తో గెలుపొందారు. ఈ విక్టరీతో గజాలా హష్మీ.. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా, తొలి ఇండియన్అమెరికన్‌గా సరికొత్త రికార్డు సృష్టించారు.
గజాలా హష్మీ అసలు పేరు గజాలా ఫైజ్ హష్మీ. ఆమె 1970 డిసెంబర్ 11న తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించినట్లు సమాచారం. ఆమె తల్లిదండ్రులు భారతీయ ముస్లిం కుటుంబానికి చెందినవారు. 1980లో కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ ఆమె విద్యావంతురాలిగా, ప్రొఫెసర్‌గా, రాజకీయ నాయకురాలిగా ఎదిగారు.50 ఏండ్ల వయస్సులో (2020లో) వర్జీనియా స్టేట్ సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
