
- అభ్యర్థిత్వం దాఖలు చేసిన ఉషా రెడ్డి
న్యూయార్క్: ఇండియన్ అమెరికన్ ఉషా రెడ్డి అమెరికాలో కాన్సాస్ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ 22 సెనేటర్‌గా డెమొక్రాటిక్ పార్టీ తరఫున మరోసారి తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరిలో రిటైర్ అయిన టామ్ హాక్ స్థానంలో ఉషా రెడ్డి నియమితులయ్యారు. ‘‘2024 ఎన్నికల కోసం కాన్సాస్ స్టేట్ సెనేటర్‌గా అభ్యర్థిత్వాన్ని సమర్పించాను. ప్రజా సేవ నా జీవితంలో ఒక ముఖ్య భాగం. సెనేటర్‌గా ప్రజల కోసం పనిచేసేందుకు అంకితభావంతో ఉన్నాను” అని ఆమె ట్వీట్ చేశారు. హెల్త్‌కేర్, మెంటల్ హెల్త్, పబ్లిక్ ఎడ్యుకేషన్, సేఫ్టీ, ఈక్విటీ, జాబ్స్, సెక్యూరిటీ, ఎకనామిక్ గ్రోత్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, చైల్డ్ కేర్ వంటి వాటిపై దృష్టి సారిస్తానని తెలిపారు. ఆమె పదవీ కాలం 2025 జనవరి నాటికి ముగుస్తుంది. కాగా, 2016, 2017, 2020లో ఉషా రెడ్డి మేయర్‌గా పనిచేశారు.