అమెరికా అధ్యక్ష బరిలో మరో ఇండో అమెరికన్

అమెరికా అధ్యక్ష బరిలో మరో ఇండో అమెరికన్

వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.  ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నుంచి  మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఇండో అమెరికన్ నిక్కీ హేలీ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఇపుడు అదే పార్టీ నుంచి  2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని  యువ మిలియనీర్, టెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి(37) ప్రకటించారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ స్పీచ్‌లు ఇవ్వడం, టెస్ట్ రన్స్  చేస్తున్నారు

మిస్టర్ రామస్వామి  తల్లిదండ్రులు కేరళ నుండి యునైటెడ్ స్టేట్స్‌కు వలసవెళ్లారు.  అతని తండ్రి ఒహియోలోని జనరల్ ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో పని చేస్తున్నారు. యేల్, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు.  రామస్వామి ఒక ప్రముఖ బయోటెక్ వ్యవస్థాపకుడు కూడా.