ఎత్తుకు పైఎత్తు వేసి పాక్‌‌‌‌కు చెక్‌.. వ్యూహాలు తెల్వకుండనే ‌‌‌గట్టి దెబ్బ కొట్టాం: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

ఎత్తుకు పైఎత్తు వేసి పాక్‌‌‌‌కు చెక్‌.. వ్యూహాలు తెల్వకుండనే ‌‌‌గట్టి దెబ్బ కొట్టాం: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

న్యూఢిల్లీ: ఆపరేషన్​ సిందూర్‌‌‌‌‌‌‌‌పై భారత ఆర్మీ చీఫ్​జనరల్​ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్‌‌‌‌పై భారత్​చెస్ ఆట ఆడిందని అన్నారు. చెస్ ఆటలోలాగా శత్రువు వ్యూహాలు తెలియకుండానే ముందుకెళ్లామని, శత్రుదేశం ఎత్తుకు పైఎత్తు వేస్తూ..  సమయానుకూలంగా గట్టి దెబ్బకొట్టామని చెప్పారు. ఈ పరిస్థితిని గ్రేజోన్ అంటారని వివరించారు. ఇటీవల తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌‌‌‌లో ఆపరేషన్‌‌‌‌ సిందూర్‌‌‌‌పై ఉపేంద్ర ద్వివేది మాట్లాడిన వీడియో వైరల్‌‌‌‌గా మారింది. ఈ ఆపరేషన్‌‌‌‌ను ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని వెల్లడించారు. 

శత్రువు అంచనా వేయలేని విధంగా దెబ్బకొట్టామని, పాకిస్తాన్‌‌‌‌, పీఓకేలో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని తెలిపారు. ఆపరేషన్​సిందూర్​ టెస్ట్​క్రికెట్‌‌‌‌లా నాలుగు రోజుల్లో నిలిచిపోయినా.. ఇది దీర్ఘకాలిక సంఘర్షణ కావొచ్చని అభిప్రాయపడ్డారు. యుద్ధం మళ్లీ ఎప్పుడైనా జరగొచ్చని, దానికి మనం సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆపరేషన్​ సిందూర్​సమయంలో కేంద్రం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిందని ఉపేంద్ర ద్వివేది తెలిపారు. మన దేశ పౌరులపై దాడిచేసిన ఉగ్రవాదులను అంతం చేసేందుకు త్రివిధ ధళాలు అనుమతి కోరిన వెంటనే ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌నాథ్​సింగ్​ ఓకే చెప్పారని పేర్కొన్నారు.