త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో 4 వారాల్లోనే ఇండ్లు కట్టిన ఆర్మీ

త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో 4 వారాల్లోనే ఇండ్లు కట్టిన ఆర్మీ

ఇండియన్ ఆర్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం నాలుగు వారాల్లోనే అన్ని హంగులతో కూడిన రెండు ఇళ్లను కట్టేసింది. ఇండియన్ ఆర్మీకి చెందిన మిలిటరీ ఇంజీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) సంస్థ.. త్రీడీ ప్రిటింగ్ టెక్నాలజీ సాయంతో వీటిని నిర్మించింది. 

గుజరాత్ లోని గాంధీనగర్ లో సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ప్రాంతంలో ఈ రెండు ఇండ్లను ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లు నిర్మించారు. ఈ ఇండ్లను ఎంఈఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్ ప్రారంభించారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో భాగంగా పూర్తిగా త్రీడీ కాంక్రీట్ బ్లాకులతో వేగంగా నిర్మాణం పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అన్ని అధునాతన సౌకర్యాలతో ఈ ఇళ్లను నాలుగు వారాల్లోనే పూర్తి చేసినట్లు చెప్పారు. ఆర్మీ జవాన్ల కోసం వీటిని నిర్మించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

డేటా సెంటర్ ఆఫీసును ప్రారంభించిన కేటీఆర్

కెనడాలో యాక్సిడెంట్.. ఐదుగురు ఇండియన్ స్టూడెంట్స్ మృతి

ఒమాబాకు కరోనా పాజిటివ్