ఒమాబాకు కరోనా పాజిటివ్

ఒమాబాకు కరోనా  పాజిటివ్

కరోనా ఎవ్వరినీ వదలడం లేదు.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దాని బారిన పడుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కరోనా బారిన పడ్డారు. ఒబామా స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కోవిడ్ పరీక్షలు చేయగా అందులో పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని ఒబామా స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్నానని.. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకిందన్నారు ఒబామా.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోనివారు ఉంటే.. వెంటనే వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు ఒబామా.  ఇక ఆయన భార్య మిచెల్ కు వ్యాక్సినేషన్ వేసుకోవడంతోపాటు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. దీంతో ఆమెకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించలేదు. 


బరాక్ ఒబామాకు కరోనా సోకడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఒబామా కోవిడ్ నుంచి తర్వగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ఒబామా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం

 

నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా బాంబులు

తల్లికి మందుల కోసం వెళ్తుంటే చంపేసిన్రు