తల్లికి మందుల కోసం వెళ్తుంటే చంపేసిన్రు

తల్లికి మందుల కోసం వెళ్తుంటే చంపేసిన్రు

కీవ్: రష్యా దళాల దాడిలో మరో ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తల్లికి మందుల కోసం కారులో వెళ్తుండగా రష్యన్లు దాడి చేయగా డాక్టర్, ఆమె తల్లి, డ్రైవర్ చనిపోయారు. వలేరియా మక్సెట్స్కా (31)ది ఉక్రెయిన్ లోని డొనెట్స్క్. ఆమె యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్(యూఎస్ఏఐడీ)లో పని చేస్తున్నారు. యుద్ధ సమయంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కీవ్​లోనే ఉండిపోయారు. ఈ క్రమంలో తన తల్లికి మందులు అయిపోవడంతో కీవ్ నుంచి పశ్చిమ ఉక్రెయిన్​కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కారులో తన తల్లిని తీసుకొని వెళ్తుండగా, కీవ్ సమీపంలో రష్యా సైనికులు వారిపై దాడి చేశారు. సోల్జర్ల కాల్పుల్లో తల్లీకూతుళ్లు సహా డ్రైవర్ మృతి చెందారు. రష్యా దాడిలో వలేరియా చనిపోయారని యూఎస్ఏఐడీకి చెందిన సమంతా పవార్ నిర్ధారించారు. ఆమె ఎంతో ధైర్యవంతురాలు అని కొనియాడారు. ‘‘డొనెట్స్క్ లో జరిగిన బాంబు దాడిలో వలేరియా ప్రాణాలతో బయటపడ్డారు. అక్కడి నుంచి కీవ్​కు వచి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడే ఉండిపోయారు” అని చెప్పారు.