బ్రహ్మాస్ బ్రహ్మాస్త్రం : విమానాల నుంచే రాకెట్ బాంబుల ప్రయోగం

బ్రహ్మాస్ బ్రహ్మాస్త్రం : విమానాల నుంచే రాకెట్ బాంబుల ప్రయోగం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్  గొప్ప విజయాన్ని సాధించింది.  బ్రహ్మోస్‌ మిస్సైల్‌ ఎర్త్‌ టూ ఎర్త్‌ వెర్షన్‌ను పరీక్షించింది. తూర్పు ద్వీపసముద్ర తీరప్రాంతానికి సమీపంలో చేపట్టిన ఈ  టెస్ట్‌ ఫైర్‌ విజయవంతమైంది. బ్రహ్మోస్  మిషన్‌ అన్ని లక్ష్యాలను సాధించిందని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా బ్రహ్మోస్ మిస్సైల్‌కు సంబంధించిన టెస్ట్‌ ఫైరింగ్‌ వీడియోలు, ఫోటోలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోస్ట్ చేసింది. 

బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచేందుకే దీన్ని ప్రయోగించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్.  ఈ క్షిపణిని భూమి, గాలి, నీటి నుంచి ప్రయోగించవచ్చు. ఇది గాలిలో తన మార్గాన్ని మార్చుకోగలదు. అంతేకాదు కదిలే లక్ష్యాలను చేధించగలదు. బ్రహ్మోస్ క్షిపణి పరిధిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్  450 కి.మీలకు పెంచింది. దీంతో బ్రహ్మోస్ పరిధిలోకి చైనా, పాకిస్తాన్‌లోని అనేక నగరాలు వచ్చాయి. ఈ క్షిపణి పొడవు 28 అడుగులు. కాబట్టి ఇది 3000 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. అంతేకాకుండా ఈ క్షిపణి 200 కిలోల వరకు అణు వార్‌హెడ్‌లతో కూడా లోడ్ చేసుకోగలదు.

బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకతలు..

  • బ్రహ్మోస్ అనే పేరు భారతదేశానికి చెందిన బ్రహ్మపుత్ర,  రష్యాకు చెందిన మోస్క్వా అనే రెండు నదుల పేర్ల నుంచి పెట్టారు. 
  • బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి
  • బ్రహ్మోస్ క్షిపణిని  జలాంతర్గాములు, నౌకలు,  యుద్ధ విమానాల నుండి ప్రయోగించొచ్చు.
  • డిఆర్డీవో, రష్యన్ ఫెడరేషన్ సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ను తయారు చేశారు.
  • ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణి యొక్క మొదటి వెర్షన్ ఇది.  
  • తొలిసారిగా 24 నవంబర్ 2020న అండమార్-నికోబార్ దీవులలో పరీక్షించబడింది.
  • బ్రహ్మోస్ క్షిపణిని చైనాకు వ్యతిరేకంగా లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో మోహరింపు
  • కొన్ని సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్‌లలో బ్రహ్మోస్ క్షిపణి
  • సరిహద్దుల్లోని నియంత్రణ రేఖకు సమీపంలోని విమానాశ్రయాల్లో బ్రహ్మోస్ క్షిపణుల మోహరింపు
  •  బ్రహ్మోస్ కిలోమీటరు దూరంలోని లక్ష్యాలను  చేధించగలదు. 
  • బ్రహ్మోస్‌ మిస్సైల్‌ పిన్‌పాయింట్‌ ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని విజయవంతంగా చేధించగలదు