శత్రుదేశాల డ్రోన్లను కూల్చేందుకు పక్షికి శిక్షణ

శత్రుదేశాల డ్రోన్లను కూల్చేందుకు పక్షికి శిక్షణ

శత్రుదేశాల నుంచి వచ్చే డ్రోన్లను కూల్చేందుకు భారత సైన్యం తొలిసారిగా ఒ పక్షికి శిక్షణ ఇచ్చింది. ఉత్తరాఖండ్ లోని ఔలిలో జరుగుతున్న సంయుక్త శిక్షణా అభ్యాస్ లో వాటిని ప్రదర్శించారు. శత్రు డ్రోన్లను వేటాడేందుకు అర్జున్ అనే పక్షిని ప్రదర్శించారు. ఈ కసరత్తులో భారత సైన్యం పక్షి, కుక్కను ఉపయోగించి శత్రు డ్రోన్ ల ప్రదేశాన్ని గుర్తించి వాటిని నాశనం చేయనున్నాయి.

సరిహద్దు దాటి పంజాబ్, జమ్మూకాశ్మీర్ ప్రాంతాలకు వచ్చే డ్రోన్ ముప్పును ఎదుర్కోవడానికి భద్రతాదళాలకు ఇలాంటి సామర్థ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. 18వ ఎడిషన్ ఇండో–యూఎస్ సంయుక్త శిక్షణ వ్యాయామం యుద్ధ అభ్యాస్ ఉత్తరాఖండ్ లో శనివారం ప్రారంభమైంది. రెండు దేశాల సైన్యాల మధ్య అత్యుత్తమ అభ్యాసాలు, వ్యూహాలు, సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు.