మంచులో గర్భిణిని మోసుకెళ్లిన ఆర్మీ జవాన్లు

మంచులో గర్భిణిని మోసుకెళ్లిన ఆర్మీ జవాన్లు

జమ్మూ కాశ్మీర్లో  భారత సైన్యం మరోసారి గొప్ప మనసు చాటు కుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్బిణిని మంచులో శ్రమించి హాస్పిటల్ కు తరలించింది. మచల్ సెక్టార్లోని కుప్వారా జిల్లాలో ఈ ఘటన జరిగింది. దూది అనే గ్రామంలో ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లుగా తెలుసుకున్న ఆర్మీ జవాన్లు వెంటనే స్పందించారు. గడ్డ కట్టిన మంచులో ఆమెను స్ట్రెచర్‌పై మోసుకెళ్లి హెలికాప్టర్ లో హాస్పిటల్ కు తరలించారు. మనిషి నడవడానికి కష్టమైన ఆ దారిలో జవాన్లు ప్రాణాలుపణంగా పెట్టి గర్భిణిని తీసుకెళ్లడంపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.