ఇండియాకు 111 మెడల్స్​

ఇండియాకు 111 మెడల్స్​
  •  ఆసియా పారా గేమ్స్ లో కొత్త చరిత్ర
  •     ఆఖరి రోజు 12 పతకాలు

హాంగ్జౌ: ఆసియా పారా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 111 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించి ఔరా అనిపించారు. ఇందులో 29 గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 31 సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 51 బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించారు. 2010లో తొలిసారి జరిగిన పారా ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోకలిపి 14 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఇండియా 15వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంతృప్తి పడింది.

నాలుగేళ్ల తర్వాత జరిగిన గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9వ స్థానంలో నిలిచింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (101) మినహా మిగతా మల్టీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో ఇప్పటి వరకు ఇండియా పతకాల సంఖ్య వంద కూడా దాటలేదు. ఇక శనివారం జరిగిన పోటీల్లో ఇండియా నాలుగు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిపి 12 పతకాలు సాధించింది. జావెలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌55లో నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈటెను 33.69 మీటర్ల దూరం విసిరి గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిచాడు.

మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 400 మీటర్ల టీ47 ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దిలీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గావియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 49.48 సెకన్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్వర్ణం సాధించాడు. చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీ1లో సతీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇనానీ దర్పన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరవగా, టీమ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సతీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సౌందర్య, అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వర్ణం నెగ్గారు. రోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌3)లో అనితా–కొంగనపల్లే నారాయణ సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించారు.