పేమెంట్స్​ ఆటోమేషన్​ పెరుగుతోంది.. అమెరికన్​ ఎక్స్​ప్రెస్​ సర్వే వెల్లడి

పేమెంట్స్​ ఆటోమేషన్​ పెరుగుతోంది.. అమెరికన్​ ఎక్స్​ప్రెస్​ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ :  దేశంలో పేమెంట్స్ సిస్టమ్​ ఆటోమేషన్​ జోరందుకుంటోందని ఒక సర్వే వెల్లడించింది. 84 శాతం బిజినెస్​లు పార్షియల్​ ఆటోమేటెడ్​ సిస్టమ్స్​ద్వారా సప్లయర్లకు  పేమెంట్స్  జరుపుతున్నట్లు తమ సర్వేలో తేలిందని అమెరికన్​ ఎక్స్​ప్రెస్​సర్వే పేర్కొంది.  సెంటర్​ ఫర్​ ఎకనమిక్స్​ అండ్​ బిజినెస్​ రిసెర్చ్​ (సీఈబీఆర్​) తో కలిసి 513 బిజినెస్​లపై ఈ సర్వే నిర్వహించారు. 

సర్వేలో సోల్​ ప్రొప్రయిటర్​బిజినెస్​లు, మైక్రో బిజినెస్​లు, స్మాల్​ అండ్​ మీడియం బిజినెస్​లతోపాటు, పెద్ద బిజినెస్​లు కూడా ఉన్నాయని అమెరికన్​ ఎక్స్​ప్రెస్​ వివరించింది. బిజినెస్​లు తమ పేమెంట్స్​ విధానాలను  పూర్తిగా  ఆటోమేట్​ చేసుకోని 34 శాతం బిజినెస్​లను వారి భాగస్వాములు ఆటోమేట్​ చేసుకోమని కోరుతున్నట్లు   సర్వేలో వెల్లడైందని తెలిపింది.  పేమెంట్స్​సిస్టమ్​ను పూర్తిగా ఆటోమేట్​ చేసుకున్న బిజినెస్​లలో 58 శాతం బిజినెస్​లు తమ ఇన్వాయిసింగ్​ యాక్యురేట్​గా ఉంటోందని, వేగం పెరిగిందని చెప్పినట్లు అమెరికన్​ ఎక్స్​ప్రెస్​ సర్వేలో తేలింది.