లియోవన్​లో ఇన్వెస్ట్​ చేసిన రోహిత్ శర్మ

లియోవన్​లో ఇన్వెస్ట్​ చేసిన రోహిత్ శర్మ

హైదరాబాద్​, వెలుగు : ఎడ్యు- ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ కంపెనీ లియో వన్​లో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్వెస్ట్​చేశారు.  భారతదేశం అంతటా విద్యార్థులకు వినూత్న పరిష్కారాలను అందించడంతో పాటు విద్యాసంస్థలలో దీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న నగదు ప్రవాహ సమస్యను పరిష్కరించే లక్ష్యంలో లియో వన్ ​పనిచేస్తోంది.

గత మూడు సంవత్సరాల్లో కంపెనీ రెండు పెట్టుబడి రౌండ్ల ద్వారా  35 మిలియన్ల డాలర్లను (దాదాపు రూ. 291 కోట్లు) సేకరించింది.  క్వెడ్​ఇన్వెస్టర్స్​, ఆవిష్కార్ క్యాపిటల్, ఆర్డెంట్ ఇన్వెస్టర్స్, డీఎంఐ ఫైనాన్స్ వంటి అనేక ఇతర పెట్టుబడిదారులు కూడా లియో వన్​కి నిధులను అందించాయి.