ఏం జరిగిన జీవితంలో ఆనందాన్ని కోల్పోవద్దు.. వైరల్గా మారిన పంత్ స్పీచ్

ఏం జరిగిన జీవితంలో ఆనందాన్ని కోల్పోవద్దు.. వైరల్గా మారిన పంత్ స్పీచ్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  జెఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి   టీమిండియా స్టార్ క్రికెటర్  రిషబ్ పంత్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంత్ ఇచ్చిన స్పీచ్ చాలా మందిలో స్ఫూర్తి నింపింది.  దీనికి సంబంధించిన  వీడియోను JSW ఫౌండేషన్ చైర్‌పర్సన్ సంగీతా జిందాల్ ట్విట్టర్ లో షేర్ చేయగా ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది.  ఒక క్రికెటర్ వయసు పెరిగే కొద్దీ ఒత్తిడి కారణంగా ఆటను ప్రేమించడం మానేస్తారు. అయితే ఏం జరిగినా, వయసు పైబడినా ఆటను ఆనందించడం మాత్రం మానుకోవద్దంటూ తన స్పీచ్ లో తెలిపాడు.  

గతేడాది డిసెంబర్‌ 30వ తేదీన పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. దీంతో పంత్‌ తిరిగి ఎప్పుడు జట్టులోకి చేరుతాడా..? అంటూ అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  పంత్‌ వచ్చే ఏడాది ప్రారంభంలోనే తిరిగి తన ఆటను మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంత్‌  బ్యాటింగ్‌తో పాటు నెట్స్‌లో కీపింగ్ చేయడం ప్రారంభించాడని బీసీసీఐ వెల్లడించింది.  ఆసియా కప్ 2023 , ICC ప్రపంచ కప్ 2023లో రిషబ్ పంత్ ఆడుతాడా లేదా అనేదానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.