మన ఎకానమీ భేషుగ్గా నడుస్తోంది : ఆశిమా గోయెల్​

 మన ఎకానమీ భేషుగ్గా నడుస్తోంది : ఆశిమా గోయెల్​

న్యూఢిల్లీ: గ్లోబల్​గా పరిస్థితులు సానుకూలంగా లేకపోయినప్పటికీ, మన ఎకానమీ మెరుగైన పనితీరుతో దూసుకెళ్తోందని ఆర్​బీఐ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్ ఆశిమా గోయెల్​ చెప్పారు. మోదీ ప్రభుత్వ హయాంలో అన్ని కీలక మాక్రో ఎకనమిక్​ ఇండికేటర్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. దేశపు పూర్తి సామర్ధ్యం బయటపడటానికి చాలా దూరమే ప్రయాణించాల్సి ఉందని పేర్కొన్నారు. 2008 గ్లోబల్ ​ఫైనాన్షియల్​ క్రైసిస్​పై  అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎక్కువగా రియాక్ట్​ అయిందని,  

Also Read : - నార్కట్​పల్లి మండలంలో టెట్​ బాగా రాయలేదని మహిళ సూసైడ్

దానికి కరప్షన్​ స్కాండల్స్​ తోడవడంతో ఎకానమీ బలహీనపడిందని గోయెల్​ వెల్లడించారు. ఎన్​డీఏ అధికారంలోకి వచ్చేప్పటికి ఎకానమీ ఒకవైపు ఫిస్కల్​ డెఫిసిట్​తో, మరోవైపు అధిక కరెంట్​ అకౌంట్​డెఫిసిట్​తో సతమతమవుతోందని చెప్పారు.

అప్పట్లో  ఇన్​ఫ్లేషన్​ ఎక్కువగానే ఉండేదని, బ్యాంకులు బలహీనమయ్యాయని ఆమె వివరించారు. ఈ పరిస్థితులన్నీ ఆ తర్వాత 9 ఏళ్లలో బాగా మెరుగైన విషయాన్ని గోయెల్​ ప్రస్తావించారు. ఇప్పుడు గ్లోబల్​గా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా, మన ఎకానమీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని పేర్కొన్నారు. ఎకనమిక్​ గ్రోత్​ను ఇండియా ఎక్కువ చేసి చూపిస్తోందనే కొంత మంది అమెరికన్​ ఎకానమిస్టుల అనుమానాలను గోయెల్​ కొట్టిపారేశారు. అన్ని రకాల డేటా ఇండికేటర్లు ఎకానమీ గ్రోత్​ను ప్రతిఫలిస్తున్నాయని చెబుతూ, కరోనా తర్వాత మన  ఎకానమీ రికవరీ అమెరికాలోని కొంత మంది ఎకనమిస్టుల అంచనాలను తలకిందులు చేసిందని పేర్కొన్నారు.