ఆకాశ విమానాలకు ఐఓసీ ఇంధనం

ఆకాశ విమానాలకు ఐఓసీ ఇంధనం

హైదరాబాద్​, వెలుగు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ), ఆకాశ ఎయిర్ మధ్య హైదరాబాద్ లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2026 వేదికగా శుక్రవారం కీలక ఒప్పందం కుదిరింది. పర్యావరణ అనుకూల విమాన ఇంధనం (ఎస్ఏఎఫ్) సరఫరా కోసం రెండు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.

 గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించి ఏవియేషన్ రంగాన్ని నెట్ జీరో దిశగా నడిపించడం ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశం. తక్కువ కార్బన్ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఇండియన్ ఆయిల్ తెలిపింది. ఇంధన ఉత్పత్తి, లాజిస్టిక్స్​ కోసం ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయని,  విమానయాన రంగంలో సుస్థిర అభివృద్ధికి ఈ ఒప్పందం కీలకమని పేర్కొంది.