
భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు కాంగ్రెస్ నేత పి.చిదంబరం. దేశ వృద్ధిరేటు నెమ్మదించిందన్న ఆయన..ద్రవ్యోల్పణం ఊహించని స్థాయికి పెరిగిందన్నారు. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై అధిక పన్నులు వేస్తూ ద్రవ్యోల్పణాన్ని పెంచుతోందన్నారు. ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వాటిని అధిగమించే మార్గాలపై దృష్టి సారించడంలేదని ఆరోపించారు. గత 7 నెలల్లో దేశం నుండి 22 బిలియన్ డాలర్లు తరలిపోయాయన్న చిదంబరం..విదేశీ మారక నిల్వలు 36 బిలియన్ డాలర్లకు తగ్గాయన్నారు.