అమిత్ షాకు 27 ప్రశ్నలు సంధించిన కేటీఆర్

అమిత్ షాకు 27 ప్రశ్నలు సంధించిన కేటీఆర్

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వార్ ఓ రేంజ్ లో నడుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వేసవిలో కూడా  తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కించేలా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్న వేళ మంత్రి కేటీఆర్  ఆయనపై  ప్రశ్నాస్త్రాలు సంధించారు.  తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందంటూ అమిత్ షాకు  27 ప్రశ్నలు వేశారు.కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని టీఆర్ఎస్ కోరితే పట్టించుకోని బీజేపీ.. గుజరాత్‌లో మాత్రం రూ. 20 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం నిజం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదన్న మంత్రి.. గుజరాత్‌కు మాత్రం ఇవ్వని హామీలను అమలు చేశారన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఒక్కటంటే ఒక్క కేంద్రీయ విద్యాసంస్థనైనా ఏర్పాటు చేశారా? అని కేటీఆర్ బీజేపీని నిలదీశారు. బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా లోని తుక్కుగూడలో  నిర్వహిస్తున్న బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా ఇవాళ హాజరుకానున్నారు. 

మరిన్ని వార్తల కోసం

రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయండి

గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం