పోలాండ్లో జాత్యాంహకార ఘటన

పోలాండ్లో జాత్యాంహకార ఘటన

అమెరికాలో కొనసాగిన జాతి వివక్ష ఘటనలు ఇప్పుడు పోలాండ్ కు పాకాయి. తాజాగా భారత్కు చెందిన ఓ వ్యక్తిపై పోలాండ్వాసి నోరు పారేసుకున్నాడు. తమ దేశంలో ఎందుకున్నావని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ జోన్ మినాడియో అనే వ్యక్తి దుర్బాషలాడాడు. సదరు వ్యక్తిని పరాన్నజీవి, ఆక్రమణదారుడంటూ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడు. 

‘‘మీరు పోలాండ్ లో ఎందుకున్నారు. అమెరికాలో కూడా చాలామంది ఉన్నారు. మీ దేశానికి ఎప్పుడు వెళ్తారు’’ సమాధానం చెప్పాలంటూ గద్దిస్తూ జోన్ మినాడియో సదరు భారతీయున్ని వీడియో తీశాడు. ఇండియన్ వ్యక్తి తనను వీడియో తీయొద్దని కోరినా వినిపించుకోలేదు. దాదాపు నాలుగున్నర నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన చూపించిన జోన్ పై నెటిజన్స్ విరుచుకపడుతున్నారు. 

సాధారణంగా అమెరికాలో తరుచూ ఇలాంటి ఘటనలు నమోదవుతుంటాయి. కొన్నాళ్ల క్రితం ఇండో అమెరికన్ పట్ల ఓ శ్వేతజాతీయుడు జాత్యంహకారం ప్రదర్శించాడు. మురికి హిందూ..అసహ్యకరమైన కుక్క అంటూ తిట్టాడు. అంతకుముందు నులుగురు భారతీయ మహిళలకు కూడా ఇటువంటి ఘటనే ఎదురైంది.