
భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి తండ్రిగా పదోన్నతి పొందాడు. అతని భార్య సోనమ్ భట్టాచార్య బెంగళూరులోని ఓ నర్సింగ్‌హోమ్‌లో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల ముగిసిన SAFF ఇంటర్‌కాంటినెంటల్ కప్ 2023లో ఛెత్రి గోల్ మలిచినప్పుడు.. తన భార్య గర్భం దాల్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గోల్ చేయగానే ఛెత్రీ.. బంతిని షర్ట్‌లోపల పెట్టుకొని.. స్టేడియంలో ఉన్న తన భార్య సోనమ్ వైపు చూసి చేతులు చాపాడు. దీంతో తన భార్య గర్భవతి అని చెప్పకనే చెప్పాడు. ఆ క్షణాలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి.
? It's a baby boy ???
— Rwichik Bhattacharyya (@IamRwichik) August 31, 2023
Sonam Bhattacharya and Sunil Chhetri are blessed with a baby boy, both mother and child are healthy and fine!
Congratulations Captain!#sunilchhetri #indianfootball pic.twitter.com/iqOkpYl7UP
39 ఏళ్ల సునీల్ ఛెత్రికి.. వయసు అనేది ఓ సంఖ్య మాత్రమే.. అది అతడిపై ఏమాత్రం ప్రభావం చూపదు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఫుట్ బాల్ లో భారత్ స్థానం ఎక్కడో దిగువన ఉంటుంది. కానీ అతను మాత్రం అందుకోలేనంత ఎత్తున ఉంటాడు. అంతటి ప్రతిభావంతుడు.