పాపం భార్య :103 ఏళ్ల వయస్సులో.. జనవరిలో పెళ్లి.. ఏప్రిల్ లో మరణం

పాపం భార్య :103 ఏళ్ల వయస్సులో.. జనవరిలో పెళ్లి.. ఏప్రిల్ లో మరణం

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని ఇత్వారా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇత్వారాకు చెందిన స్వాతంత్య్రసమరయోధుడు హబీబ్ నాజర్ వయసు 103 ఏళ్లు. నాజర్ రెండో భార్య కన్నుమూయడంతో  ఫిరోజ్ జహాన్ (49) అనే మహిళను ఈ ఏడాది జనవరిలో మూడో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మూడు నెలలకు అనగా ఏప్రిల్​ లో హబీబ్ నాజర్ మరణించాడు. 
 
2024 జనవరిలో  103 ఏళ్లస్వాతంత్య్రసమరయోధుడు  హబీబ్ నాజర్ మూడవ వివాహం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏప్రిల్​11న  స్వాతంత్య్రసమరయోధుడు  హబీబ్ నాజర్ మరణించినట్లు అతని మనవడు తెలిపారు.  హబీబ్​  స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ఇటీవలే ప్రధాని మోదీ నుంచి ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు.  ఒంటరిగా ఉండటం ఎందుకు అనుకొని ఈ ఏడాది జనవరిలో   మూడో పెళ్లి చేసుకున్నారు. 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్   అనే మహిళను ఆయన వివాహం చేసుకున్నారు.  ఒంటరిగా ఉండలేని 103 ఏళ్ల  ఓ స్వాతంత్య్రసమరయోధుడు మూడో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన  కొన్ని నెలలకే హబీబ్ నాజర్ మరణించారు.

103 ఏళ్ల హబీబ్ నాజర్ కు ... చివరి రోజుల్లో  ఆయన మూడో భార్య ఎంతో సేవ చేసింది. హబీబ్ భోపాల్‌లోని ఇత్వారాలో నివసించాడు. ఆయన ఇంటి గోడలపై ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు అని నిరూపించే అనేక ఛాయాచిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు భర్త చనిపోయాక తమ భార్య ఎలా బతుకుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫిరోజ్ జహాన్ ప్రస్తుతం తన భర్త మరణంతో షాక్‌లో ఉంది.

జనవరిలో హబీబ్  మూడో పెళ్లి వీడియో వైరల్ అయింది.  ఆయన వివాహం చేసుకుని ఆటోలో వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొట్టింది. ఫిరోజ్ జహాన్  కూడా ఇది రెండవ వివాహమే. ఆమె భర్త చనిపోవడంతో ఆమె కూడా ఒంటరిగా ఉండలేక నాజర్‌ ను పెళ్లి చేసుకున్నట్లు వివరించారు. ఇందులో ఎవరి బలవంతం లేదని నా ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నాను అని ఆమె తెలిపారు.