డీప్ఫేక్లపై కేంద్రం సీరియస్..సోషల్ మీడియా కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్

డీప్ఫేక్లపై కేంద్రం సీరియస్..సోషల్ మీడియా కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్

డీప్ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై సోషల్ మీడియా కంపెనీలకు కేంద్రఐటీ మంత్రిత్వశాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వారం రోజుల్లోగా సోషల్ మీడియా కంపెనీలు డీప్ ఫేక్ సమస్యను అరికట్టేందుకు తమ నిబంధనలు భారత లా చట్టాల ప్రకారం సవరించుకోవాలని హెచ్చరించింది. రూల్స్ బ్రేక్ చేస్తే ఫిర్యాదు చేసేందుకు అందుబాటులో గురువారం డీప్ ఫేక్ లపై సమావేశం అనంతరం కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లకు తెలియజేశారు. ప్రస్తుత ఐటీ రూల్స్ లోని రూల్ 31(14)(b)ని ఉల్లంఘించే కంటెంట్ ను వినియోగదారు ఫిర్యాదు చేసిన 36 గంటల్లో నిర్దిష్ట కంటెంట్ ను తొలగించాలని తెలిపారు. 

 

డీప్ ఫేక్ లు, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మేటీరియల్ వంటివి కంటెంట్ ప్రస్తుతం భారతీయ ఇంటర్నెట్ లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు ఐటీ రూల్స్ ఉల్లంఘించినసందర్భాలను వినియోగదారులు తెలిపేందుకు డిజిటల్ ప్లాట్ ఫారమ్ ను రూపొందించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అన్ఫర్మేషన్ టెక్నాలజ రూల్ సెవెన్ అధికారిని నియమిస్తుందని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఉల్లంఘనలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.ఈ డిజిటల్ ప్లాట్ ఫారమ్ ను వినియోగదారులు చేసిన కంప్లైంట్స్ ను పరిస్కరించేందుకు ఉపయోగిస్తారు. 

సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లు నిర్దిష్ట రకాల కంటెంట్ ను సృష్టించడం అనుమతించడబడదని తమ వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ప్రస్తుత నియమాలు, చట్టాలు డీప్ ఫేక్ లను అనుమతించకూడదని అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు అంగీకరించాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.