
లుసానే: తొలిసారి ప్రవేశపెట్టిన ఎఫ్‌ఐహెచ్ హాకీ ఫైవ్స్ టోర్నీలో ఇండియా జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇండియా మెన్స్ టీమ్ ఓ డ్రా, ఓ గెలుపుతో శుభారంభం చేయగా, విమెన్స్ టీమ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. శనివారం స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4–3తో గెలిచిన ఇండియా.. పాకిస్తాన్‌తో జరిగిన సెకండ్ మ్యాచ్‌ను 2–2తో డ్రా చేసుకుంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా తరఫున మోరింగెతెమ్ రబీచంద్ర (1వ ని.), గురీందర్ (19వ ని.) గోల్స్ చేశారు. రాహీల్ మహ్మద్ (2, 10వ ని.) పాక్‌కు రెండు ఫీల్డ్ గోల్స్ అందించారు. వింక్లెర్ జొనాస్ (6వ ని.), రెనిహార్డ్ ఫాబియో (11వ ని.), కురెసి ప్యాట్రిక్ (16వ ని.) స్విస్‌కు గోల్స్ అందించారు. హాఫ్ టైమ్ వరకు ఇండియా 3–1 లీడ్ సాధించింది. మరోవైపు ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో 3–4తో ఓడిన విమెన్స్ టీమ్.. పోలెండ్ చేతిలో 1–3తో పరాజయంపాలైంది.