ఒలంపిక్స్‌: భారత హకీ షెడ్యూల్‌ ఖరారు

ఒలంపిక్స్‌: భారత హకీ షెడ్యూల్‌ ఖరారు

ట్యోక్యో వేదికగా వచ్చే ఏడాది నిర్వహించే ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్ల షెడ్యూల్‌ ఖరారైంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్‌) టోక్యో ఒలంపిక్స్‌కు సంబంధించిన ఈవెంట్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు ట్యోక్యో ఒలంపిక్స్‌ జరగనున్నాయి. జులై 24న గ్రాండ్ గా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించి… ఆ తర్వాత రోజు నుంచి హకీ మ్యాచ్‌లు మొదలుపెట్టనున్నారు.

ఈ మెగా టోర్నీలో మొదటి రోజే భారత్‌ బరిలో దిగనుంది. గ్రూప్‌-Aలో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుండగా, జులై 26న ఆస్ట్రేలియాతో, 28న స్పెయిన్‌తో, 30న అర్జెంటీనాతో, 31న జపాన్‌తో ఆడనుంది.

గ్రూప్‌-Aలో ఉన్న భారత మహిళల జట్టు నెదర్లాండ్‌తో  తలపడనుంది. జులై 27న జర్మనీతో, 29న బ్రిటన్‌తో, 31న ఐర్లాండ్‌తో, ఆగస్టు 1న దక్షిణాఫ్రికాతో భారత మహిళలు పోటీపడనున్నారు.