
లాహోర్: జైషే మహ్మద్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ పాకిస్తాన్లో బహవల్పూర్లోని ఓ ఇంట్లో సేఫ్‌గా ఉన్నాడని మన ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. మసూద్ పరారీలో ఉన్నాడన్న పాక్ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చాయి. పారిస్‌లో జరుగుతున్న టెర్రర్ వాచ్డాగ్ ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) మీటింగ్నేపథ్యంలోనే మసూద్ను పాక్ ఆర్మీ, ఐఎస్ఐ దాచిపెట్టిందని ఆరోపించాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. మసూద్ అజహర్, అతని కుటుంబాన్ని పాక్ ఆర్మీ అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య బహవల్పూర్ తరలించింది. అక్కడ జైషే మహ్మద్ ఏర్పాటు చేసుకున్న కొత్త హెడ్‌క్వార్టర్స్ లో మసూద్ను దాచిపెట్టింది. సెక్యూరిటీ కోసం భారీగా బలగాలనూ మోహరించింది.
మసూద్ మాదేశంలో లేడు..
జైషే చీఫ్ మసూద్ అజహర్ కనిపించడంలేదని, దేశం విడిచి పారిపోయాడని పాక్ ఆర్థిక మంత్రి హమద్ అజహర్ సోమవారం చెప్పారు. మసూద్ మిస్సింగ్ నేపథ్యంలో పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోయారని అన్నారు. అయితే, ఎఫ్ఏటీఎఫ్ కీలక మీటింగ్ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఈ కొత్త వాదన తెరపైకి తెచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్స్ విషయంలో ఎఫ్ఏటీఎఫ్ గైడ్‌లైన్స్ పాటిస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడానికి పాక్ ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మసూద్ అజహర్.. అరెస్టు, విడుదల
1994… ఫేక్ ఐడెంటిటీతో ప్రయాణిస్తున్న మసూద్ అజహర్‌ను కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు.
1995.. మసూద్ను విడిపించడం కోసం టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్‌లో ఆరుగురు ఫారెనర్ల టీంను కిడ్నాప్ చేశారు. అందులో ఇద్దరు బయటపడగా.. మిగతా నలుగురి జాడ తెలియలేదు.
1999… నేపాల్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేశారు. సయీద్‌తో పాటు మరో ముగ్గురిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పట్లో తాలిబన్ల అధీనంలోని కాందహార్‌కు విమానాన్ని మళ్లించారు. విమానంలోని ప్రయాణికులను విడిపించేందుకు ఇండియన్ గవర్నమెంట్ సయీద్‌ను విడుదల చేసింది.
మసూద్ విడుదల తదనంతర పరిణామాలతో హర్కతుల్ అన్సర్ సంస్థను అమెరికా బ్యాన్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లిస్టులో చేర్చింది. దీంతో హర్కతుల్ అన్సర్ పేరును హర్కతుల్ముజాహిదీన్గా మార్చారు. మసూద్ అజహర్ మరో కొత్త సంస్థను ‘జైషే మహ్మద్’ పేరుతో స్థాపించాడు. పాక్‌ఐఎస్ఐ మసూద్‌కు సాయం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
2001లో జైషే మహ్మద్ టెర్రరిస్టులుఇండియన్ పార్లమెంట్‌పై అటాక్ చేశారు. ఈ దాడిలో లష్కరే తోయిబా సాయం కూడా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడిలో పాల్గొన్న ఐదుగురు టెర్రరిస్టులను ఢిల్లీ పోలీసులు కాల్చేశారు. ఆరుగురు పోలీసులు కూడా ఈ దాడిలో చనిపోయారు. పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత వచ్చిన విమర్శలు, ఇండియాతో పాటు అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడితో పాక్ ప్రభుత్వం మసూద్ను అరెస్టు చేసింది.
2008లో జరిగిన ముంబై అటాక్స్‌లో, 2016లో జరిగిన పఠాన్‌కోట్ అటాక్ లతో పాటు గతేడాది జరిగిన పుల్వామాఅటాక్లోనూ మసూద్ సయీద్, జైషే మహ్మద్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. మన సర్కార్‌తగిన ఆధారాలు ఇచ్చినా పాక్ ప్రభుత్వం మసూద్‌పై చర్యలు తీసుకోలేదు. ఎప్పటికప్పుడు మసూద్ పరారీలో ఉన్నాడని వాదిస్తోంది. మసూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా యూఎన్ ప్రకటించింది.