న్యూఢిల్లీ: కామన్వెల్త్ యూత్– జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్, యూనివర్సల్ కప్‌లో ఇండియా లిఫ్టర్లు నాలుగు గోల్డ్ మెడల్స్‌తో మెరిశారు. సమోవా దేశం అపియాలో మంగళవారం జరిగిన మెన్స్ 65 కేజీ కేటగిరీలో సునీల్ సింగ్ మొత్తం 271 కేజీల (స్నాచ్ 126+ క్లీన్ అండ్ జెర్క్ 145) బరువెత్తి టాప్ ప్లేస్‌తో స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. మెన్స్ 71 కేజీ డివిజన్‌లో అభినోబ్ గొగోయ్ మొత్తం 284 కేజీలు మోసి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఐసాంగ్‌ఫా గొగోయ్, చారు పేసి కూడా గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.

