ఫేస్​బుక్ ​ప్రేమ..​ దేశం దాటించింది

ఫేస్​బుక్ ​ప్రేమ..​ దేశం దాటించింది

కోల్​కతా: అబ్బాయిది బెంగాల్​లోని నదియా జిల్లా బల్లవపూర్. అమ్మాయిది బంగ్లాదేశ్​లోని నెరైల్​ఏరియా. ఫేస్​బుక్​ పరిచయం ప్రేమకు దారితీసింది. కొంతకాలంగా ఒకరినొకరు లవ్​ చేసుకుంటున్న ఈ జంట పెండ్లి చేసుకోవాలనుకున్నారు. అబ్బాయి జయికంటో చంద్రరాయ్(24) బంగ్లాదేశ్​ వెళ్లడానికి ప్లాన్​వేశాడు. మార్చి10న ‘అప్పు’ అనే ఓ బ్రోకర్​ హెల్ప్​తో అక్రమంగా ఇండియా–బంగ్లాదేశ్​ ఇంటర్నేషనల్ ​బార్డర్ ​దాటాడు. మార్చి10న అమ్మాయి(18)ని అక్కడే పెళ్లి చేసుకొని ఈ నెల 26 వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత అమ్మాయితో ఇండియా రావడానికి లోకల్​దళారికి 10 వేల బంగ్లాదేశ్​కరెన్సీ ఇచ్చాడు. మధుపూర్ సరిహద్దుల వద్ద ఇద్దరు బార్డర్ దాటే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్​వర్గాలు 82వ బెటాలియన్​ ట్రూప్స్​కు ఇన్ఫర్మేషన్​ఇచ్చాయి. దీంతో ఈనెల 26న భద్రతా బలగాలు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశాయి. విచారిస్తే అబ్బాయి ఐడెంటిటీ వివరాలు సరిగానే ఉన్నా.. అమ్మాయివి లేవు. దీంతో బీఎస్ఎఫ్ ఆఫీసర్స్​ వాళ్లను భీంపూర్ పోలీసులకు అప్పగించారు. అక్రమంగా బార్డర్​ దాటినందుకు వారిపై చర్యలు ఉంటాయని 82వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ సంజయ్ ప్రసాద్ సింగ్ వెల్లడించారు. సరిహద్దుల్లో విమెన్ ​ట్రాఫికింగ్​ఎక్కువగా జరిగే చాన్స్ ఉందని, అమాయక అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచార రొంపిలోకి దింపుతుంటారని, ఈ ఇద్దరి విషయంలో మాత్రం అలాంటిదేమీ లేదని, వీరి ప్రేమలో నిజాయతీ ఉందని ప్రసాద్​ సింగ్​ పేర్కొన్నారు.