లండన్ లో రేప్ చేసి ఇండియాకు జంప్: అరెస్ట్ చేసిన పోలీసులు

లండన్ లో రేప్ చేసి ఇండియాకు జంప్: అరెస్ట్ చేసిన పోలీసులు

లండన్ లో ఓ మహిళను అత్యాచారం చేసి భారత్ కు పారిపోయి వచ్చిన అతన్ని పట్టుకున్నారు పోలీసులు. అజయ్ రానా(35) అనే అతను లండన్ లోని సఫోల్క్ ప్రాంతంలో అతడి దోస్తుతో కలిసి నివసిస్తున్నాడు. డిసెంబర్ 9, 2017 న అజయ్ తన ఫ్రెండ్ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఓ మహిళ(30)కు లిఫ్ట్ ఆఫర్ చేశాడు. అప్పటికే కారులో ఇద్దరు ఉండటం.. బయట వాతావరణం చల్లగా ఉండటంతో ఆమె కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక ఆ కారులోని ఇద్దరు దిగిపోయారు.  దీంతో కారును పక్కకు ఆపి ఆ మహిళపై అజయ్ అత్యాచారం చేశాడు.

అజయ్ నుంచి తప్పించుకుని దగ్గరలోని స్నేహితుల ఇంటికి చేరింది ఆ మహిళ. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న లండన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఎటువంటి ఆధారాలు లభించక పోవడంతో కేసు ఓ మిస్టరీగా మారింది. దీంతో కారు ప్రయాణించిన రూట్ లో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి పోలీసులు ఆరాతీశారు. ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో అజయ్ ఉంటున్న ఇంటిని గుర్తించారు.

అజయ్ నివసించే ఇంటికి వెళ్లి లండన్ పోలీసులు విచారించగా… అతని దోస్త్ మాత్రమే అక్కడ ఉన్నాడు. అయితే అజయ్ తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని భారత్ కు వెళ్లినట్లు అతడి ఫ్రెండ్ పోలీసులకు తెలిపాడు. దీంతో అజయ్ వాడుతున్న ఇయర్ ఫోన్స్ ను తీసేకుని  ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. దీంతో అత్యాచారం చేసింది అజయ్ అని నిర్ధారించుకున్నారు పోలీసులు. ఆపై అతని కదలికలపై నిఘా ఉంచారు లండన్ పోలీసులు.

గత అక్టోబర్ లో అజయ్ స్పెయిన్ కు వెళ్లినట్టుగా గుర్తించిన పోలీసులు… స్పానిష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతన్ని వారు అరెస్ట్ చేశారు. యురోపియన్ అరెస్ట్ వారెంట్ పై నిర్భందంలోకి తీసుకుని నవంబరులో లండన్ కు తరలించారు.

లండన్ కోర్టులో తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు అజయ్ రానా. తాను ఆ మహిళపై అత్యచారం చేశానని తెలిపాడు. దీంతో అతడికి ఏడేళ్ల జైలుశిక్ష విధించారు జడ్జి. అంతకు ముందు బాధితురాలు కోర్టులో తన బాధను తెలుపుతూ.. ఆ రేపిస్ట్ కోసం తన జీవితాంతం వెదుకుతానని చెప్పింది.