భార్యను కాపాడబోయి.. ఆస్పత్రిలో చావుతో పోరాటం

భార్యను కాపాడబోయి.. ఆస్పత్రిలో చావుతో పోరాటం

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న భార్యను కాపాడబోయి భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.90 శాతం వరకు గాయాలపాలై ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

అనీల్ నినాస్ (32) అనే కేరళకు చెందిన వ్యక్తి ఉద్యోగ రీత్యా భార్య, కుమారుడితో కలసి కొన్నేళ్లుగా దుబాయ్ లోని ఉమ్ అల్ క్వెయిన్ లో ఉంటున్నాడు. అయితే సోమవారం రాత్రి.. వారు నివాసముండే అపార్ట్ మెంట్ కారిడార్ లోని ఎలక్ట్రిక్ బాక్స్ షార్ట్ సర్క్యూట్ కు గురైంది. దీంతో మంటలు సంభవించడంతో అతని భార్య ఆ మంటల్లో చిక్కుకుంది. ఆమెను కాపాడబోయే ప్రయత్నంలో అనీల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు అతన్ని కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించారు. అతని భార్య  ప్రాణాలతో బయటపడింది గాని అనీల్ కి మాత్రం 90 శాతం వరకు గాయాలయ్యాయి.

“అతని పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మేమంతా ఆయన కోసం ప్రార్థిస్తున్నాము” అని ఆసుపత్రిలో ఉన్న అనిల్ నినాన్ బంధువు ఒకరు మీడియాకు తెలిపారు. అతని భార్య నీను పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని డాక్టర్లు చెప్పారన్నారు. ఆమెకు కేవలం 10 శాతం గాయాలు మాత్రమే అయ్యాయని పేర్కొన్నారు. ఈ దంపతులకు 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.

Indian Man In UAE Suffers 90 Per Cent Burns While Trying To Save Wife