BrahMos: ట్రంప్‌కి భారత్ మరో షాక్.. రష్యాకు ఇండియన్ నేవీ-ఎయిర్‌ఫోర్స్ బ్రహ్మోస్ ఆర్డర్!

BrahMos: ట్రంప్‌కి భారత్ మరో షాక్.. రష్యాకు ఇండియన్ నేవీ-ఎయిర్‌ఫోర్స్ బ్రహ్మోస్ ఆర్డర్!

అనేక దశాబ్ధాలుకు భారత మిత్ర దేశం రష్యా. ట్రంప్ నాలుగు హెచ్చరికలు జారీ చేయగానే భయపడేరకం కాదు భారత్ అని మరో సారి రుజువైంది. మెున్న అమెరికా నుంచి యుద్ధ విమానాలు కొనటం ఇష్టం లేదని చెప్పేసిన భారత్ ఆపరేషన్ సిందూర్ తర్వాత రష్యాకి మరో మెగా మిలిటరీ ఆర్డర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

ఇండియా రష్యా సంయుక్తంగా సిద్ధం చేసిన మిసైల్ సిస్టమ్ బ్రహ్మోస్. ఇది ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ మిలిటరీ బేస్ లను గజగజలాడించింది. మే నెలలో యుద్ధం తర్వాత దాదాపు మూడునెలలైనా పాక్ ఆర్మీ బేసులు ఇంకా డ్యామేజీకి రిపోర్లు చేసుకునే పనిలో ఉందంటే దాని శక్తి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం భారత నేవీ, ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణుల కొనుగోలుకు రష్యా వద్ద పెద్ద ఆర్డర్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. 

ALSO READ | ట్రంప్ డబుల్ గేమ్ : రష్యాతో బిజినెస్ కొనసాగిస్తున్న యూఎస్, ఇండియాపై ఆంక్షలు..!!

భారత సాయుధ దళాలు బ్రహ్మోస్ క్షిపణిని మరింతగా విస్తరించాలని ప్లాన్ చేశాయి. ఈ క్రమంలో నేవీ తన వార్ షిప్స్ పైన సముద్రపు వేరియంట్ బ్రహ్మోస్.. అలాగే ఎయిర్ ఫోర్స్ రష్యా తయారు చేసిన సు-30 ఎంకేఐ యుద్ధ విమానాలకు బ్రహ్మోస్ క్షిపణులు ఆకాశం నుంచి వినియోగించేందుకు వీలుగా అమర్చాలని నిర్ణయించింది. యుద్ధంలో నిలిచి తన సత్తాను చాటిన బ్రహ్మోస్ పనితీరుపై ప్రధాని నుంచి రక్షణ మంత్రి వరకు అందరూ సంతృప్తిగా ఉన్నారు.

రాడార్లకు చిక్కకుండా అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్లను నాశనం చేయటంలో బ్రహ్మోస్ పనితీరు ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. దీంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈ మిసైల్ గురించి ఆరా తీసే స్థాయిలో దాని పనితీరు ఉండటం గమనార్హం. దాదాపు డజనుకు పైగా దేశాలు బ్రహ్మోస్ కొనుగోలుకు ఆసక్తి చూపటం దానికి నిదర్శనం. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడి నుంచైనా శత్రువులపై విరుచుకుపడగల ఈ బ్రహ్మోస్ 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగలదని నిరూపించబడింది. ప్రస్తుతం తయారవుతున్న దీని కొత్త వేరియంట్లు మరింత దూరంలోని లక్ష్యాలను చేరుకునేలా డెవలప్ చేయబడుతున్నాయని వెల్లడైంది.