ఇండియన్ నేవీలో ఉద్యోగాలు: బీటెక్, ఎంసీఏ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్..

ఇండియన్ నేవీలో  ఉద్యోగాలు: బీటెక్, ఎంసీఏ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్..

ఇండియన్ నేవీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: ఎస్ఎస్​సీ ఆఫీసర్ – ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ). 

మొత్తం ఖాళీలు: 15. 

ఎలిజిబిలిటీ 
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ / కంప్యూటర్ ఇంజినీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / సాఫ్ట్​వేర్ సిస్టమ్స్ / సైబర్ సెక్యూరిటీ / సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ & నెట్‌వర్కింగ్ / కంప్యూటర్ సిస్టమ్స్ & నెట్‌వర్కింగ్ / డేటా అనలిటిక్స్ / ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - విభాగాల్లో కనీసం 60 శాతం  మార్కులతో బీఈ/ బి.టెక్, ఎం.టెక్/ ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి  లేదా కనీసం 60% మార్కులతో బీసీఏ/ బీఎస్సీ/ ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి.   పదోతరగతి, ఇంటర్మీడియట్ స్థాయిల్లో ఇంగ్లిష్​లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

వయోపరిమితి: అభ్యర్థులు 2002, జనవరి 1 నుంచి 2007 జులై 1 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 16.

లాస్ట్ డేట్: జూన్ 1. 

సెలెక్షన్ ప్రాసెస్: ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ joinindiannavy.gov.in ను సందర్శించండి.