న్యూఢిల్లీలోని నావల్ హెడ్‌క్వార్టర్స్, మ్యాన్ పవర్ ప్లానింగ్ & రిక్రూట్‌మెంట్ డైరెక్టరేట్అగ్నిపథ్ స్కీమ్ కింద 01/ 2027, 02/ 2027 బ్యాచుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: అగ్నివీర్ (అప్రెంటీస్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి పూర్తిచేసి ఉండాలి.
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్స్ మూడేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి .
అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
నాలుగేళ్ల సర్వీస్ కాలంలో వివాహం చేసుకోవడానికిఅనుమతించరు.
స్పోర్ట్స్, స్విమ్మింగ్, ఎక్స్ ట్రా –కరిక్యులర్ యాక్టివిటీస్ లో ప్రావీణ్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయోపరిమితి
అగ్నివీర్ (అప్రెంటీస్) 01/ 2027 బ్యాచ్: 2004, డిసెంబర్ 1 నుంచి 2009, మే 31 మధ్యలో జన్మించి ఉండాలి.
అగ్నివీర్ (అప్రెంటీస్) 02/ 2027 బ్యాచ్: 2005, మే 1 నుంచి 2009, అక్టోబర్ 31 మధ్యలో జన్మించి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 5.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ (స్టేజ్ I – ఐఎన్ఈటీ) రూ.550 చెల్లించాలి. స్టేజ్–IIకు ఎలాంటి ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జూన్ 9.
స్టేజ్ I - ఐఎన్ఈటీ ఎగ్జామినేషన్: 2026, ఆగస్టు.
సెలెక్షన్ ప్రాసెస్: స్టేజ్I – ఐఎన్ఈటీ, స్టేజ్ II – పీఎఫ్ టీ, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ joinindiannavy.gov.inను సందర్శించండి .
ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్
కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించే పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, సైన్స్, మ్యాథమెటిక్స్, డిప్లొమా (సంబంధిత ట్రేడ్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. విభాగాల వారీగానూ, మొత్తంగానూ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
