ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ పదవి రేసులో భారత సంతతి యువతి

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ పదవి రేసులో భారత సంతతి యువతి

ఐక్యరాజ్య సమితి తదుపరి సెక్రటరీ జనరల్‌ పదవి రేసుకు భారత సంతతి యువతి 34 ఏళ్ల అరోరా ఆకాంక్ష  పోటీ పడుతున్నారు. ప్రస్తుత జనరల్‌ సెక్రటరీ ఆంటోనియా గుటెరస్‌పై పోటీకి దిగుతున్నట్లు ప్రకటించిన మొదటి వ్యక్తి కూడా ఆమె. ప్రస్తుతం ఆమె ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ఆడిట్‌ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

75 సంవత్సరాలుగా ప్రపంచానికి ఐక్యరాజ్యసమితి ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చలేకపోయిందని, శరణార్థులను రక్షించలేకపోవడంతో పాటు సాంకేతిక ఆవిష్కరణలు సరిగ్గా జరగలేదన్నారు ఆకాంక్ష. అన్నీ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టేందుకు తాను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు ఐదేళ్ల పదవి కాలానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా తానే కొనసాగాలని కోరుతానని అంటోనియా గుటెరస్‌ గత నెలలో చెప్పారు. ఆయన పదవి కాలం ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగియనుంది. తదుపరి ఐక్యరాజ్య సమితి జనరల్‌ పదవీకాలం వచ్చే ఏడాది నుండి ప్రారంభం కానుంది.