అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి..ఏడాదిలో ఇది ఐదోది

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి..ఏడాదిలో ఇది ఐదోది

అమెరికాలో భారతీయ విద్యార్థుల వరస మరణాలు కలకలం రేపుతున్నాయి. సమీర్ కామత్ అనే భారతీయ సంతతికి చెందిన విద్యార్థి గత వారం అమెరికాలోని నేచర్ రిజర్వ్ వద్ద అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఏడాదిలో జరిగిన ఐదవ సంఘటన. ఇప్పటివరకు కామత్ మృతి మిస్టరీగానే ఉంది. 

అమెరికాలోని విలియంస్పోర్ట్ లోని 3300 నార్త్ వారెన్ కైంటీ రోడ్ 50 వెస్ట్ లోని క్రోవ్స్ గ్రీవ్ నేజర్ ప్రిజర్వ్ లో సోమవారం ( ఫిబ్రవరి 5) 5 గంటలకు అతని మృత దేహం కొనుగొన్నట్లు మంగళవాళం అక్కడి అధికారులు తెలిపారు. 
స్థానిక మీడియా ప్రకారం ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో కామత్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. కామత్ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులకు తెలియజేశామని, పోస్ట్ మార్టమ్ నిమిత్తం క్రాఫోర్డ్స్ విల్లేలో తరలించామని అధికారులు తెలిపారు. 

పర్డ్యూలో చదువుతున్న మరో భారతీయ సంతతి విద్యార్థి నీల్ ఆచార్య క్యాంపస్ లో శవమై కనిపించిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. నీల్ ఆచార్య జాన్ మార్టన్సన్ ఆనర్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ , డేటా సైన్స్ లో డబుల్ మేజర్. మరో ఘటనలో 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి ఓహియోలో మృతిచెందగా.. జార్జియాలో ఎంబీఏ విద్యా్ర్థి వివేక్ సైనీ అగంతకుల దాడిలో మరణించాడు. 

అమెరికాలో పెరుగుతున్న భారతీయుల మరణాలపై భారతీయ విద్యార్థి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ కు చెందిన మరో భారతీయ విద్యార్థిపై ఈ వారం అతని ఇంటికి సమీపంలో దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. చికాగో నగరంలో నలుగురు సాయేుధ దొంగల దాడికి గురైన సయ్యద్ మజాహిర్ అలీకీ సహాయం చేస్తామని అమెరికాలోని భారత మిషన్ హామీ ఇచ్చింది.