
విమానంలో ఇద్దరు ప్రయాణికులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అప్పటివరకు ప్రశాంతంగా సీట్లలో కూర్చున్న పక్కపక్క సీటు ప్రయాణికులు ఇద్దరు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుపడ్డారు. తోటి ప్రయాణికులు వారిస్తున్న వినలేదు. పిడిగుద్దులనుంచి ఇంకా ముందుకెళ్లి ఓ ప్రయాణికులు తన ప్రత్యర్థి మెడను కోసే స్థాయికి వివాదం ముదిరింది.విమానం ల్యాండ్ అవగానే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎయిర్ పోర్టు పోలీసులు. విమానంలో గాల్లో ఎగురుతూ ఉండగానే ఫైటింగ్ ఇన్సిడెంట్ జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఫ్రంటీనియర్స్ ఎయిర్ లైన్ విమానం ఫిలెడెన్ఫియా నుంచి మియామికు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భారతీయ సంతతికి చెందిన 21 యేళ్ల ఇషాన్ శర్మ , పక్క సీటు ప్రయాణికుడు కీన్స్ ఇవాన్స్ తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నాడు. అప్పటివరకు ప్రశాంతంగానే ఉన్న ఇషాన్, ఇవాన్.. ఒక్కసారిగా లేచి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరు మెడలు పట్టుకొని పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. విమానం గాల్లో ఎగురుతుండగానే ఈ ఫైట్ సీన్ జరిగింది. తోటి ప్రయాణికులు వారిస్తున్న వినలేదు.
Ishaan Sharma, 21, was arrested and charged with battery after the incident on a flight bound for Miami, Florida #frontier #southflorida #arrest pic.twitter.com/rUuRVpE7v9
— American Crime Stories (@AmericanCrime01) July 2, 2025
ఫైటింగ్ కాస్త ముదిరి గొంతు కోసుకునే స్థాయికి వెళ్లింది. ఇండియన్ సంతతి ఇషాన్ శర్మ, తోటి ప్రయాణికులు ఇవాన్స్ గొంతు కోశాడని ఆరోపణలో పోలీసులు అతన్ని ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఈ గొడవలో శర్మ ఎడమ కనుబొమ్మ పైన గాయం కాగా, ఎవాన్స్ ముఖంపై గీతలు పడ్డాయి. ఫైటింగ్ తర్వాత శర్మ నవ్వుతూ తన సీటుకు తిరిగి వచ్చి తన రక్తసిక్తమైన ముఖంతో సెల్ఫీలు తీసుకున్నాడని, ఆ తర్వాత అతడి చేతులకు సంకెళ్లు వేసి పోలీసులు విమానం నుంచి బయటకు తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ది డైలీ మెయిల్ ప్రకారం.. శర్మను మొదట చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి పోలీసులు తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఇషాన్ ధ్యానం చేస్తుండగా ఈ వివాదం మొదలైందని..పక్కసీటు ప్రయాణికుడు ఇవాన్స్ కు ఇషాన్ శర్మ ధ్యానం నచ్చలేదని.. అతడిని డిస్ట్రబ్ చేశాడని ఇషాన్ శర్మ లాయర్ విచారణ సందర్భంగా కోర్టుకు వివరించారు. నా క్లయింట్ ధ్యానం చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు అతని పక్కన ఉన్న ప్రయాణీకుడికి అది నచ్చలేదు. అందుకే దాడి చేశాడని చెప్పారు.
అయితే ఈ వివరణతో న్యాయమూర్తి ఒప్పుకోలేదు. మయామి-డేడ్ సర్క్యూట్ జడ్జి జెరాల్డ్ హబ్బర్ట్ శర్మకు 500 డాలర్ల జరిమాని విధించారు. ఎవాన్స్‌ను పాఠశాల లేదా కార్యాలయానికి దగ్గరగా వెళ్లకుండా నిషేధిస్తూ స్టే-అవే ఆర్డర్ జారీ చేశారు.