పెండ్లయిన కొన్ని గంటల్లోనే విషాదం.. హనీమూన్‌‌‌‌‌‌‌‌కు వెళ్తుండగా కూలిన హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..వరుడి డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ కింద 5 గంటలు చిక్కుకున్న నవ వధువు

పెండ్లయిన కొన్ని గంటల్లోనే విషాదం.. హనీమూన్‌‌‌‌‌‌‌‌కు వెళ్తుండగా కూలిన హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..వరుడి డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ కింద 5 గంటలు చిక్కుకున్న నవ వధువు
  • పెండ్లయిన గంటల వ్యవధిలోనే అమెరికాలో విషాదం
  • వరుడి డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ కింద 5 గంటలు చిక్కుకున్న నవ వధువు

వాషింగ్టన్: పెండ్లయిన కొద్ది గంటలకే జరిగిన హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమాదంలో మన దేశ మూలాలున్న యువ పైలట్‌‌‌‌‌‌‌‌ ప్రాణాలు కోల్పోయారు. అతడి భార్య జెస్నీ తీవ్రగాయాలతో బయటపడ్డారు. కేరళకు చెందిన 26 ఏండ్ల దేవ్‌‌‌‌‌‌‌‌ ఫిజీ.. తన మ్యారేజీ అనంతరం హనీమూన్‌‌‌‌‌‌‌‌కు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రం డాసన్‌‌‌‌‌‌‌‌విల్లేలో శుక్రవారం దేవ్‌‌‌‌‌‌‌‌.. జెస్నీని వివాహం చేసుకున్నారు. పదేండ్ల కింద ఓ చర్చిలో జరిగిన వీరిద్దరి పెండ్లి వేడుకకు 400 మందిదాకా అతిథులు హాజరయ్యారు. 

వివాహం, విందు ముగిసిన తర్వాత నూతన దంపతులు హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు బయల్దేరారు. అట్లాంటా నగరానికి వెళ్లి అక్కడి నుంచి హనీమూన్‌‌‌‌‌‌‌‌కి వెళ్లేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్కున్నారు. అయితే, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు వెళ్లేందుకు టేకాఫ్‌‌‌‌‌‌‌‌ అయిన వీళ్ల హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాసేపటికే డాసన్‌‌‌‌‌‌‌‌కౌంటీలోని అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో వరుడు దేవ్‌‌‌‌‌‌‌‌ ఫిజీతోపాటు చాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడుపుతున్న ప్రధాన పైలట్‌‌‌‌‌‌‌‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. వధువు జెస్నీ తీవ్రగాయాలతో శిథిలాల కిందే ఐదారుగంటలపాటు చిక్కుకుపోయారు. రెస్క్యూ టీమ్స్‌‌‌‌‌‌‌‌ వచ్చి ఆమెను అట్లాంటాలోని ఆస్పత్రికి తరలించాయి.