లండన్: యూకేలోని వెస్ట్ మిడ్ ల్యాండ్స్‌లో దారుణం చోటు చేసుకున్నది. భారత సంతతికి చెందిన పంజాబీ యువతి అత్యాచారానికి గురైంది. జాత్యహంకారంతోనే 32 ఏండ్ల నిందితుడు.. యువతిని రేప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ వాల్సాల్లోని ఓ ఇంట్లో యువతి కుటుంబం నివాసం ఉంటోంది. శనివారం సాయంత్రం 32 ఏండ్ల వ్యక్తి తలుపు తట్టాడు. ఆ టైంలో యువతి ఒంటరిగా ఉండడంతో తలుపు తెరవలేదు.
దీంతో నిందితుడు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటికొచ్చిన బాధితురాలు.. పార్క్హాల్ ప్రాంతంలో కూర్చుంది. ఆమె పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
